ప్రజాపక్షం/ముషీరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో చేనే త కార్మికుల పాత్ర ఎనలేనిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. చేనేతల వర్గాల పెద్దాయన గా దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాఫూజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ‘చేనేత ఆత్మహత్య బాధితుల కుటుంబా ల’ ఆధ్వర్యంలో పలువురు మహిళలతో కలిసి “జాతీయ నేతన్నల ఐక్యవేతిక చైర్మన్ దాసు సురేష్ చేనేతల ఆత్మగౌర వ దీక్ష” చేపట్టారు. ఈ కార్యక్రమానికి చాడ వెంకటరెడ్డితోపాటు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్య, కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు, మాజీ ఎంఎల్సి చెరుపల్లి సీతారాములుతోపాటు పలు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ… స్వరాష్ట్రం వస్తే తమ సమస్యలు తీరుతాయి, తలరాత మారుతుందని సంతోషించిన చేనేతల పరిస్థితి కెసిఆర్ పాలనలో దారుణంగా ఉందన్నారు. పేరుకు బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ నేతన్నల కు అల్లావుద్దీన్ అద్భుత దీపం చూపుతున్నారని ఎద్దేవ చేశా రు. దివంగత కొండా లక్ష్మణ్ బాఫూజీ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తెలంగాణ కోసం చివరి శ్వాస వరకు అధిష్టానానికి వ్యతిరేకంగా పనిచేశారని గుర్తుచేశారు. నేడు పోచంపల్లి, గద్వాల్, సిరిసిల్ల తదితర ప్రాంతాల నేతన్నలు దినదిన గండంగా బతుకు వెళ్లదీస్తుంటే పాలక నేతలు మా త్రం బతుకమ్మ చీరలతో చేనేతను ఆదుకున్నామని నమ్మబలుకుతున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయం అం టూ ఢిల్లీలో ధర్నా చేసే కెసిఆర్ చేనేత కార్మికులకు పెన్షన్ లు, వారి వృత్తికి ఇవ్వాల్సిన సౌకర్యాలను కల్పించాలన్న ఇంగితం లేదా అన్ని ప్రశ్నించారు. గత బడ్జెట్లో చేనేతల కు రూ.13వందల కోట్లు కేటాయించినట్లు చెప్పి ఒక్క రూ పాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. సమస్యల కోసం గొంతెత్తితే కేసులతో భయపెడుతున్నారని, జనం ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడంలేదా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చేనేతలతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి హితవుపలికారు. ఒక పక్క కుటుంబ పెద్దను కోల్పోయి అనేక చేనేత కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతాయుతంగా చేనేత రంగానికి మరింత బడ్జెట్ కేటాయించి చేనేత రం గంపై ఆధారపడి జీవిస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య బాధిత కుంటుంబాల కోసం ఏర్పాటు చేసిన నిధికి చాడ వెంకటరెడ్డి కొంత విరాళం అందించారు. ప్రొఫెసర్ కోదండరామ్ తన ప్రసంగంలో… వ్యవసాయం తర్వాత ప్రధానమైన చేనేత రంగం ఈ ప్రభుత్వంలో తీవ్ర నిరాధరణకు గురువుతోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో చేనేతలు చేసిన కృషిని ముఖ్యమంత్రి అప్పుడే మరిచిపోయారా అని ఎద్దేవా చేశారు. తక్షణమే చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరా రు. ఇంకా ఆర్. క్రిష్ణయ్య మాట్లాడుతూ…సంపద సృష్టిలో చేనేతలది ప్రత్యేక కృషి అని పేర్కొన్నారు. చేనేతల ఉద్యమాలకు బిసి సంక్షేమ సంఘం పూర్తి సంఘీభావం ఉంటుందన్నారు. వి. హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్ల శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ…టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని ఆరోపించారు. పచ్చగా ఉండాల్సిన చేనేత రంగం ప్రభుత్వ ఉదాసీనత కారణంగా రోడ్డున పడిందన్నారు. చేనేత ఆత్మగౌరవ దీక్షలో ప్రధానపాత్ర పోషించిన దాసు సురేష్ మాట్లాడు తూ…చేనేతల ఆత్మగౌరవానికి ప్రభుత్వం భంగం కలిగిస్తోందన్నారు. బాధిత కుంటుంబాలకు అనేక ప్రయోజనాలు కల్పిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకొనే నాథుడేలేడని వా పోయారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆత్మహత్య బాధితకుటుంబాలకు సత్వర న్యాయం చేయడంతోపాటు ఈ బడ్జెట్లో చేనేతలకు మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పిఎస్ పక్షాన ఒయు విద్యార్థి నే త రమేష్, పద్మశాలి, చేనేత నాయకులు పాచికంటి లక్ష్మినర్సయ్య, కూరపాటి రమేష్, చిలువేరు కాశీనాథ్, చింతికింది రమేష్, గొల్లపల్లి దయానంద్, బిసి సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, ప్రధాన కార్యదర్శి జనార్థన్, గం జి మురళి, బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
కెసిఆర్ ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే
RELATED ARTICLES