సౌతాఫ్రికాతో తొలి వన్డేకు టీమిండియా సన్నద్దం
ధర్మశాల: న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమైన కోహ్లీసేన స్వదేశంలో మరో సవాల్‌కు సిద్ధమైంది. గురువారం నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్ తొలి వన్డే హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా జరగనుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత ఆటగాళ్లు మంగళవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి సహా జట్టు ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. 15న లక్నోలో రెండో వన్డే, మూడో వన్డే 18న కోల్‌కతాలో జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు డే-నైట్ మ్యాచ్‌లే కావడం విశేషం. ఇటీవల న్యూజిలాండ్‌లో పర్యటించిన టీమిండియా టీ-20 సిరీస్‌ను 5-0తో వైట్‌వాష్ చేసి, వన్డే సిరీస్‌ను 0-3, టెస్టు సిరీస్‌ను 0–2తో క్లీన్ స్వీప్ గురైంది. దీంతో, సౌతాఫ్రికాతో జరిగే ఈ వన్డే సిరీస్‌లోనైనా రాణించి, పూర్వపు ఫామ్ అందుకోవాలని కోహ్లీసేన తహతహలాడుతోంది. ఇదిలా ఉండగా ఈ సిరీస్‌ను కరోనా వైరస్ భయం వెంటాడుతోంది. దేశంలో దాని ప్రభావం అంతగా లేకున్నా జనాల్లో నెలకొన్న భయం మ్యాచ్ హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్యపై ప్రభావం చూపనుంది. ఇక ఆటగాళ్లు కూడా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణాల్లో మాస్క్‌లు ధరిస్తున్నారు. బీసీసీఐ కూడా షేక్ హ్యాండ్స్, ఫ్యాన్స్ ఇంటరాక్షన్స్, సెల్ఫీలు ఇవ్వదని ఆటగాళ్లకు గ్్ైడ లైన్స్ జారీ చేసింది.
కఠోర సాధన
RELATED ARTICLES