హైదరాబాద్ : శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి రెండవ నోటిఫికేషన్‌ను గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ శనివారం జారీ చేశా రు. మార్చి 6న ఉదయం 11 గంటలకు అసెంబ్లీహాల్‌లో శాసనసభ, శాసనమండలి ఉభయ సభలు సమావేశం కానున్నాయి. సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ఇదిలా ఉండగా అదే రోజు శాసనసభ వ్యవహారాల సలహా మండలి (బిఎసి) సమావేశమై ఉభయ సభల బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది.
6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ భేటీ
RELATED ARTICLES