బుమ్రా బౌలింగ్‌పై జహీర్‌ఖాన్ స్పందన
ముంబయి : న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు, బుమ్రా కెరీర్‌లో కూడా ఓ సిరీస్‌లో వికెట్ తీయకపోవడం ఇదే తొలిసారి. ఫలితంగా వన్డే ర్యాంక్సింగ్స్‌లో అగ్రస్థానాన్ని కూడా కోల్పోయాడు. దారుణ వైఫల్యంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నబుమ్రాకు కివీస్ కెప్టెన్ న్యూజిలా్‌ండ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. చేతిలో బంతి ఉంటే బుమ్రా ఎంతో ప్రమాదకారని ఈ న్యూజిలా్‌ండ కెప్టెన్ కొనియాడాడు. తాజాగా భారత మాజీ పేసర్ జహీర్‌ఖాన్ సైతం బుమ్రాకు మద్దతుగా నిలిచాడు. ఓ స్పోరట్స్‌చానెల్‌తో మాట్లాడుతూ.. బుమ్రా బౌలింగ్ పదును పెంచాలని సూచించాడు. ముఖ్యంగా డిఫెన్సివ్ బ్యాట్స్‌మన్‌పై తన అటాకింగ్ పెరగాలన్నాడు.
బుమ్రా బౌలింగ్ జాగ్రత్తగా..
‘అతి తక్కువ సమయంలోనే బుమ్రా కీలక బౌలర్‌గా మారిపోయాడు. బుమ్రా ఒక ప్రత్యేకతను చాటుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో రిథమ్ ఏమీ తగ్గలేదు. కానీ ప్రత్యర్థి ఆటగాళ్లు బుమ్రాను జాగ్రత్తగా ఆడాలనే ఆలోచనతో బరిలోకి దిగుతున్నారు. ఒక వన్డే మ్యాచ్‌లో బుమ్రా ఓవర్లలో 35 పరుగులు వచ్చినా ఫర్వాలేదు కానీ వికెట్‌ను ఇవ్వకూడదనే ధోరణితో ఆడుతున్నారు. బుమ్రాను బౌలింగ్‌లో ఎలాంటి తప్పులు చేయకుండా ఆచితూచి ఆడుతున్నారు. మిగతా బౌలర్లపై దాడి చేస్తున్నారు. దీంతోనే బుమ్రా వికెట్లను సాధించడం కష్టమవుతుంది. ఇక బుమ్రా తన బౌలింగ్‌కు మరింత పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. తన బౌలింగ్‌ను రక్షణాత్మక ధోరణితో ఆడుతున్నారనే విషయం బుమ్రాకు కూడా తెలుసు. దాంతో వికెట్లను ఏ విధంగా సాధించాలి అనే దానిపై బుమ్రా దృష్టి నిలపాలి. బ్యాట్స్‌మెన్ తప్పులు చేసే విధంగా బౌలింగ్‌కు పదును పెట్టాలి. ఎందుకంటే బుమ్రా బౌలింగ్‌ను జాగ్రత్తగా ఆడుతూ వికెట్లు ఇవ్వకుండా ఉండటానికే ప్రత్యర్థి జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయనే విషయం స్పష్టంగా కనబడుతోంది. దీనిపై బుమ్రా ఫోకస్ పెట్టి మరింత దూకుడైన బౌలింగ్‌తో బరిలోకి దిగాలి’ అని జహీర్ సూచించాడు.
గత 6వన్డేల్లో ఒక్క వికెటే..
ఇక చివరిగా ఆడిన ఆరు వన్డేల్లో కలిపి బుమ్రా కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. వరుసగా నాలుగు వన్డేల్లో వికెట్ పడగొట్టలేకపోయాడు. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జరిగిన చివరి వన్డేలో 10 ఓవర్లు వేసిన బుమ్రా 38 పరుగులిచ్చాడు. గత ఏడాది చివర్లో వెన్ను గాయంతో మూడు నెలలు క్రికెట్‌కి దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా.. జనవరిలో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ.. పునరాగమనంలో బుమ్రా బౌలింగ్‌లో మునుపటి పదును కనిపించడం లేదు. ముఖ్యంగా.. డెత్ ఓవర్లలో గతంలోలా యార్కర్లని సంధించడంలో ఈ అగ్రశ్రేణి పేసర్ విఫలమవుతున్నాడు. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానం కోల్పోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన బుమ్రా.. ఏకంగా 45 రేటింగ్ పాయింట్లు కోల్పోయి రెండవ స్థానంకు పడిపోయాడు. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బోల్ట్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 719 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
అందుకే విఫలమవుతున్నాడు
RELATED ARTICLES