న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా తొమ్మిదోసారి వడ్డీరేట్లను (ఎంసిఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎంసిఎల్ఆర్ రేటు 7.90గా ఉంది.. తాజా 0.05 శాతం( 5బేసిస్ పాయింట్ల) తగ్గింపుతో 7.85కు చేరినట్లు సమాచారం. ఈ సరికొత్త రేట్లు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయం తో గృహ, వాహన రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి.టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ చెల్లించే వడ్డీరేట్లను కూడా తగ్గించాలని నిర్ణయించింది. ఈ తగ్గింపు 10 బేసిస్ పాయింట్ల వరకు ఉంటుంది. ఇక బల్క్ టర్మ్ డిపాజిట్లపై 20 బిపిఎస్ పాయింట్ల తగ్గింపు ఉంటుంది. ఇవి కూడా ఫిబ్రవరి 10 తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఎస్బిఐ రుణాలు కూడా 6.8శాతం పెరిగాయని ఒక ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్‌తో ముగిసే సంవత్సరానికి రూ. 23,01,669 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు 17.49శాతం పెరిగాయని వెల్లడించింది. ఆర్బిఐ పరపతి విధాన కమిటీ(ఎంపిసి) రెపో రేటును యథాతథంగా కొనసాగించనున్నట్లు ప్రకటించిన మారునాడే ఎస్బిఐ ఈ విషయాన్ని ప్రకటించింది.
ఎస్బిఐ గృహ, వాహన రుణాలుమరింత చౌక
RELATED ARTICLES