మొదటి వన్డేలో టీమిండియా పరాజయం
న్యూజిలాండ్‌ను గెలిపించిన రాస్ టేలర్, టామ్ లాథమ్
రాహుల్, అయ్యర్ శ్రమ వృథా
10తో సిరీస్‌లో కివీస్ ఆధిక్యం
హామిల్టన్ : న్యూజిలాండ్ పర్యటనలో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం హామిల్టన్‌లోని సెడాన్ పార్కు వేదికగా జరిగిన తొలి వన్డేలో నాలుగు వికెట్లతో భారత్‌ను కివీస్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరును సాధించింది. శ్రేయస్ అయ్యర్ (103) కెరీర్‌లో తొలిసెంచరీతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ (88 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51) ఫిఫ్టీతో రాణించాడు. అనంతరం న్యూజిలా్‌ండ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 348 పరుగులు చేసి గెలుపొందింది. వెటరన్ రాస్ టేలర్ (109 నాటౌట్) సెంచరీతో రాణించాడు. రెండో వన్డే ఆక్లాండ్లో శనివారం జరుగుతుంది. నిజానికి ఛేదనలో కివీస్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (32), హెన్రీ నికోల్స్ (78) శుభారంభం అందించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జంట.. తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అయితే కుదురుగా సాగుతున్న ఈ జోడీని శార్దూల్ ఠాకూర్.. గప్తిల్‌ను ఔట్ చేసి విడదీశాడు. అనంతరం టామ్ బ్లండెల్ (9) త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. ఈదశలో నికోల్స్-టేలర్‌తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ స మయోచితంగా ఆడారు. వేగంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. అదే జోరులో మూడో వికెట్‌కు 62 పరుగుల జత చేశారు. ఈక్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న నికోల్స్.. త్వరగాన ఔటయ్యారు. ఈక్రమంలో టేలర్.. టామ్ లాథమ్ (69)తో కలిసి జట్‌ఉటను విజయం దిశగా నడిపించాడు వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 138 పరుగులు జోడించి, భారత శిభిరంలో అందోళన రెకేత్తించారు. ఫిఫ్టీ అయ్యాక లాథమ్‌ను ఔట్ చేసిన భారత్.. జజేమ్స్ నీషమ్ ((9), గ్రాండ్‌హోమ్ (1)ను పెవిలియన్‌కు పంపింది. అయితే మరో ఎండ్‌లో సెంచరీ పూర్తి చేసుకున్న టేలర్ చివరికంటా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. భారత బౌలర్లలో కుల్దీప్‌కు రెండు వికెట్లు దక్కాయి.
టేలర్, లేథమ్ దూకుడు
ఛేదనకు దిగిన కివీస్‌కు ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (78; 82 బంతుల్లో 11×4), మార్టిన్ గప్తిల్ (32; 41 బంతుల్లో 2×4) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం అందించారు. 5 ఓవర్ల వ్యవధిలోనే గప్తిల్, బ్లండెల్ (9) పెవిలియన్ చేరడంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పడింది. వ్యక్తిగత స్కోరు 10 వద్ద రాస్‌టేలర్ ఇచ్చిన క్యాచ్‌ను కుల్‌దీప్ జారవిడచడం చేటు చేసింది. నికోల్స్‌తో కలిసిన టేలర్ తన అనుభవంతో 62 పరుగుల చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు. కుల్‌దీప్ (10 ఓవర్లలో 84; 2 వికెట్లు), జడేజా (10 ఓవర్లలో 64), శార్దూల్ ఠాకూర్ (9 ఓవర్లలో 80; 1 వికెట్) మధ్య ఓవర్లలో తేలిపోయారు. ఐతే జట్టు స్కోరు 171 వద్ద నికోల్స్‌ను కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌తో రనౌట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన టామ్ లాథమ్ (69; 48 బంతుల్లో 8×4, 2×6) మొదట్లో తడబడ్డ పుంజుకొని ఎడాపెడా సిక్సర్లు, బౌండరీలు బాదాడు. మరోవైపు టేలర్ నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించేశాడు. నాలుగో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. డెత్ ఓవర్లలో బుమ్రా, షమి కట్టుదిట్టంగా బంతులు వేశారు. లేథమ్, జిమ్మీ నీషమ్ (9), గ్రాండ్‌హోమ్ (1) వెంటవెంటనే ఔటవ్వడంతో మ్యాచ్‌పై ఆశలు చిగురించాయి. అద్భుతం జరుగుతుందేమో అనిపించింది. ఐతే శార్దూల్ వేసిన 47వ ఓవర్లో మిచెల్ శాంట్నర్ (12; 9 బంతుల్లో) అద్భుతమైన సిక్సర్, బౌండరీ సాధించడంతో మ్యాచ్ డ్రా అయింది. ఆ తర్వాత బంతికే టేలర్ జట్టుకు విజయం అందించాడు. బుమ్రా (13), షమి (7) కలిసి 20 వైడ్లు వేయడం గమనార్హం. న్యూజిలాండ్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక ఛేదన.
శ్రేయస్ శ్రమ వృథా..
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగే సూపర్. 54 పరుగుల్లోపే పృథ్వీషా (20; 21 బంతుల్లో 3×4), మయాంక్ అగర్వాల్ (32; 31 బంతుల్లో 6×4) పెవిలియన్ చేరినా విరాట్ కోహ్లీ (51; 63 బంతుల్లో 6×4)తో కలిసి సమయోచితంగా ఆడాడు. చక్కని బౌండరీలతో అలరించాడు. మూడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అర్ధశతకం కాగానే కోహ్లీని సోధి బౌల్ చేశాడు. అప్పుడు జట్టు స్కోరు 156. ఈ క్రమంలో మోచేతి ఇబ్బంది పెట్టినప్పటికీ శ్రేయస్ వీరోచితంగా ఆడాడు. ఐదో స్థానంలో వచ్చిన కేఎల్ రాహుల్ (88 నాటౌట్; 64 బంతుల్లో 3×4, 6×6) కలిసి 136 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. 46 ఓవర్లో అతడిని సౌథీ ఔట్ చేశాడు. అయితే రాహుల్ వరుస సిక్సర్లతో చెలరేగాడు. శతకం చేసేలా కనిపించాడు. చివర్లో కేదార్ జాదవ్ (26 నాటౌట్; 15 బంతుల్లో 3×4, 1స6) ఎక్కువ స్ట్రైక్ తీసుకోవడంతో కుదర్లేదు. –
బుమ్రా.. 13 వైడ్‌లు
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంటేనే ప్రత్యర్థి జట్లు గడగడ వణుకుతాయి. అతడి వైవిధ్యాన్ని అర్థం చేసుకోలేక బ్యాట్స్‌మెన్ తడబడతారు. గాయపడి జట్టులో పునరాగమనం చేసిన ఈ పేసుగుర్రం త్వరగానే లయ అందుకున్నాడు. కాగా అప్పుడప్పుడు విఫలమవుతున్నాయి. తొలి వన్డేలో అతడు పరుగులను నియంత్రించినప్పటికీ ఏకంగా 13 వైడ్లు విసిరాడు. బహుశా అతడి కెరీర్‌లో ఇన్ని వైడ్లు ఎప్పుడూ వేసివుండడు. షమి సైతం 7 వైడ్లు వేశాడు. టీమ్‌ఇండియా అత్యుత్తమ పేసర్లైన వీరిద్దరు 20 అదనపు పరుగులు ఇవ్వడం భారత ఓటమికి ఒక కారణం! ఇక శార్దూల్ ఠాకూర్ 2, జడేజా, కుల్‌దీప్ చెరో వైడ్ విసిరారు. మొత్తంగా 24 వేశారు. కివీస్ 19 మాత్రమే విసరడం గమనార్హం. అయితే మంచు కురవడంతో బంతిపై పట్టుదొరకలేదు! భారత జట్టు ఇన్ని వైడ్లు విసరడం ఇదే తొలిసారి కాదు. 2007లో చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో 25, అదే ఏడాది ముంబయిలో ఆస్ట్రేలియాపై 26 వైడ్లు విసిరింది. ఇక 2004లో ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై 28, 1999లో బ్రిస్టల్‌లో కెన్యాపై 31 వైడ్లు వేసింది. దాదాపుగా ఈ వేదికలన్నీ మంచుకురిసే ప్రాంతాల్లోనే ఉన్నాయి.