రూ.51.36 లక్షల నగదు స్వాధీనం
అదనపు డిజిపి జితేందర్ వెల్లడి
ప్రజాపక్షం/హైదరాబాద్; రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన 4969 మందిపై కేసులు నమోదు చేసినట్లు అదనపు డిజిపి జితేందర్ వెల్లడించారు. తన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసుల తనిఖీలో నిబంధనలకు విరుద్ధ్దంగా తరలిస్తున్న రూ.51.36 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నామినేషన్ల ఘట్టం నుంచి ప్రచార పర్వం ముగింపు వరకు ఎలాంటి అవవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారన్నారు. నేడు జరిగే పోలింగ్ బందోబస్తులో రాష్ట్రవ్యాప్తంగా 50వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారన్నారు. తెలంగాణ స్పెషల్ పోలీసుతో పాటు ఇతర ప్రత్యేక పోలీసు దళాలలను తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన వ్యూహాత్మక ప్రాంతాల్లో నియమించామన్నారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిస్థితులను పర్యవేక్షించేందుకు శాంతిభద్రతల విభాగం అదనపు డిజిపి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేయడం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలను కచ్చితంగా పాటించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని యూని ట్ పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు.పోలీసు శాఖతో పాటు ఎక్సైజ్, అటవీ తదితర శాఖల నుండి కూడా బలగాలను ఎన్నికల విధులకు నియమించామన్నారు. రాష్ట్రంలో తీవ్రవాద, ఇతర సమస్యాత్మక ప్రాంతా ల్లో ఏ విధమైన అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఆ యా ప్రాంతాల్లోని ఓటర్లలో మనోస్థుర్యైం నింపేందుకు డామినేషన్ ఎక్సర్‌సైజ్‌లను విస్తృతంగా చేపట్టామన్నారు. పోలింగ్ సామాగ్రితో వెళ్లే ఎన్నికల సిబ్బందిని నిర్ధేశిత పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా వెళ్లేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కూడా తగు బందోబస్తును ఏర్పాటు చేశారు.ఇక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 4969 మందిపై 1122 కేసులు నమోదు చేశామన్నారు. అలాగే రూ. 21,22,933 విలువగల మద్యంను స్వాధీనం చేసుకున్నామన్నారు. ముం దు జాగ్రత్త చర్యల్లో భాగంగా 1745 లైసెన్స్ రివాల్వర్‌లను డిపాజిట్ చే యించడం జరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదని డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. చెక్‌పోస్టుల ఏర్పాటు, వాహనాల సోదాలు, సర్వేలన్స్ టీంల ఏర్పాటు ద్వారా పోలీసు అధికారు లు రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తతతో ఉన్నారని పేర్కొన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాలకు బయటి వ్యక్తులు రాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్పూర్తిని కలిగించే విధంగా గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున పాల్గొన ఇతమ ఓటు హక్కును స్వేచ్ఛాగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.
4969 మందిపై కేసులు
RELATED ARTICLES