పోర్ట్ ఎలిజిబెత్: సౌతాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరుస పరాజయాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనైన డుప్లెసిస్ సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలనే ఉద్దేశంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ ఓటమి అనంతరం అతను చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ’టీ20 వరల్డ్‌ప్ వరకు ఆడాలనునుకుంటున్నా. ఇక ఈ ఏడాది పెద్దగా టెస్ట్ మ్యాచ్‌ల్లేవ్. జూలైలో వెస్టిండీస్‌తో మినహా మరే సిరీస్ లేదు. కాబట్టి ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టే స్వదేశంలో నాకు చివరిది కావచ్చు. క్లిష్ట సమయాల్లో జట్టును నిలబెట్టేవాడు కెప్టెన్ అని నేను నమ్ముతా. నేను కొంత ఒత్తిడికి లోనైన మాట వాస్తవం. కానీ ఆ ఒత్తిడిలో కూడా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడా. నా అవసరం జట్టుకుంటే మాత్రం నేను దూరమవ్వను.’అని తెలిపాడు. వరుసగా టెస్ట్ సిరీస్‌లు ఓడిపోవడంతో ఈ సఫారీ కెప్టెన్ కొంత ఒత్తిడికిలోనైట్లు తెలుస్తోంది. శ్రీలంక, ఇండియా చేతిలో ఓడిన సౌతాఫ్రికా ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో 2-1తో వెనుకంజలో నిలిచింది. ఇక డుప్లెసిస్ వ్యక్తిగత పెర్ఫామెన్స్ కూడా అంతగా బాలేదు. ఇండియా సిరీస్ నుంచి 12 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 21.25 సగటులతో కేవలం 255 పరుగులే చేశాడు. ఇక మూడో టెస్ట్‌లో ఇంగ్ల్ండ ఘన విజయం సాధించింది. కెప్టెన్ జో రూట్ (4/87) బంతితో మ్యాజిక్ చేయడంతో.. ఇంగ్లీష్ జట్టు ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. విదేశాల్లో ఇది ఇంగ్లండ్‌కు 150వ టెస్ట్ విజయం కావడం విశేషం. 102/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదవ రోజు సోమవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 88.5 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌట్ అయింది. రూట్‌కు తోడు మార్క్ వు్డ మూడు వికెట్లు తీయడంతో ప్రొటీస్ కోలుకోలేకపోయింది. ఫిలాండర్ (13), రబడ (16), నొర్జే (5), మహారాజ్ (71) చివరి రోజు పెవిలియన్ చేరారు. కెప్టెన్ డుప్లెసిస్ (36), మహారాజ్ (71) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్ల్ండ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు నష్టపోయి 499 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. బెన్ స్టోక్స్ (120; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఒలీ పోప్ (135 నాటౌట్; 18 ఫోర్లు, సిక్స్) సెంచరీలతో కదం తొక్కారు. మహారాజ్ 5 వికెట్లు తీసాడు. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 209 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఎల్గర్ (35), డికాక్ (63) పర్వాలేదనిపించారు. బెస్ 5 వికెట్లు కూల్చాడు.
టెస్టులకు డుప్లెసిస్ వీడ్కోలు
RELATED ARTICLES