వారంలో బస్తాకు రూ.20-25 పెరిగే అవకాశం
ప్రజాపక్షం/హైదరాబాద్: సిమెంట్ ధరలకు రెక్కలు రానున్నాయి. ఒక్కో సిమెంట్ బస్తాపై రూ. 20 నుండి 25కు పెంచాలని సిమెంట్ కంపెనీలు నిర్ణయించాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో బస్తా సిమెంట్ ధరలు ఇలా ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ బస్తా ధర రూ. 225, బిర్లా ఎ1 -రూ. 225, పెన్నా సిమెంట్ రూ. 225, ఎసిసి కాంక్రీట్ ప్లస్ రూ. 365, రాశి సిమెంట్ రూ. 322 ఉన్నాయి. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకులు ముఖ్యంగా జిప్సం ధరల పరుగుదలతో పాటు బొగ్గు సరఫరా సరైన మోతాదులో లేక పోవడం కారణంగా ఈ ధరలు పెంచుతున్నట్లు సిమెంట్ కంపెనీలు చెబుతున్నాయి. దీనికి తోడు రవాణా ఖర్చు కూడా తమకు తడిసి మోపెడు అవుతోందని , రైల్వే ఛార్జీలపై 10 శాతం పెరుగుదల కూడా ఒక కారణమని చెబుతున్నారు. ఈ కష్టాలు చాలవన్నట్లు కేంద్ర ప్రభుత్వం 2012 అక్టోబర్ నుండి 3.69 శాతం సేవా పన్నును పెంచింది. అలాగే జిఎస్‌టి పెరుగుదల కూడా తోడైనట్లు సిమెంట్ పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి.
సిమెంట్ ధరలకు రెక్కలు
RELATED ARTICLES