మహిళల వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్
రష్యా : భారత చెస్ క్రీడాకిరిణీ కొనేరు హంపి మాస్కో వేదికగా జరిగిన చెస్టీల్లో చైనాకు చెందిన లీ టింగ్జీపై గెలిచి రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. 32 ఏళ్ల ఈ భారతీయ క్రీడారిణీ మరోసారి చైనాకు చెందిన టాంగ్పై 12వ, చివరి రౌండ్ గేమ్ గెలిచి, టింగీపై టైతో ఆధిపత్యం చెలాయించింది. ఆమె విజయం సాధించిన అనంతరం మాట్లాడుతూ.. ‘మూడో రోజు నా మొదటి ఆట ప్రారంభించినప్పుడు నేను అగ్రస్థానంలో ఉంటానని ఊహించలేదు. కానీ, మొదటి మూడు స్థానాలకు చేరుకోవాలనేది నా ఆశ. టై -బ్రేక్ ఆటలను ఆడాలని కూడా ఎప్పుడు అనుకోలేదు‘ అని హ ంపి అన్నారు. ఆమె తల్లి అయిన తర్వాత 2016 నుంచి 2018 వ రకూ రెండేళ్ల విశ్రాంతి తీసుకుంది. ‘మొదటి గేమ్‌లో ఓడినప్పటికీ రెండో గేమ్‌లో తిరిగి పుంజుకున్నాను. ఇక మూగో గేమ్‌లో సులభంగా విజయం సాధించాను’ అని తెలిపింది. కాగా, ఈ ఛాంపియన్స్ షిప్లో 13వ క్రీడాకారిణీగా బరిలోకి దిగిన హంపి టింగ్జీ, టర్కీకి చెందిన ఎకాటెరినా అటాలిక్లతో పోరాడి మొత్తం 9 పా యింట్లు సాధించింది. మొదటి ఐదు రౌండ్లలో 4.5 పాయింట్లు సా ధించిన హంపి, ఆ తరువాత రష్యాకు చెందిన ఇరినా బుల్మాగాపై జరిగిన ఓటమితో కొద్దిగా నిరాశచెందింది. అయినా మిగతా రౌండ్లలో ఆత్మ విశ్వాసంతో, పక్కా వ్యూహాత్మకంతో ఆడిన హంపీ విజ యం సాధించింది. దీంతో పసిడి ఆమె సొంతం అయ్యింది. టింగ్జీ వెండి పతకంతో సరిపెట్టుకోగా కాంస్యం అటాలిక్ను వరించింది.
హంపి సంచలనం
RELATED ARTICLES