ఆటగాళ్ల కొనుగోలుకు కోట్లు కుమ్మరించిన ప్రాంఛైజీలు
పాట్ కమ్మిన్స్‌కు రూ. 15. కోట్లు.. మాక్స్‌వెల్‌కు రూ. 10.75 కోట్లు
భారత ఆటగాళ్లలో పియూష్ చావ్లా రికార్డు
రూ. 6.75 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై
ఆస్ట్రేలియా, విండీస్ క్రికెటర్లకే ప్రాధాన్యత
అన్‌సోల్డ్ జాబితాలో పూజారా, హనుమ విహారి
తెలుగు క్రికెటర్ల ఊసేలేదు
ఐపిఎల్-2020 వేలం
కోల్‌కతా : ఐపిఎల్ 2020 సీజన్‌కు ఆటగాళ్ల వేలం కొనసాగుతోంది… మొత్తం 338 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా… ఈ సారి ఆసీస్ క్రికెటర్ పాట్‌కమ్మిన్స్ జాక్‌పాట్ కొట్టాడు… కమ్మిన్స్‌ను రూ. రూ.15.50 కోట్లకు దక్కించుకుంది కోల్‌కతా జట్టు. ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ జట్టు రూ. 10.75 కోట్లకు దక్కించుకోగా.. సౌతాఫ్రికా ఆటగాడు క్రిస్ మెరిస్‌ను రూ.10 కోట్లకు బెంగళూరు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్‌కు చెందిన సామ్ కర్రన్‌ను రూ. 5.50 కోట్లకు చెన్నై, ఇంగ్లండ్‌కు చెందిన మరో ఆటగాడు ఇయాన్ మోర్గాన్‌ను రూ.5.25 కోట్లకు కోల్‌కతా జట్టు దక్కించుకుంది. ఇక, ఆసీస్‌కు చెందిన ఆరోన్ ఫించ్‌ను రూ.4.40 కోట్లకు బెంగళూరు జట్టు… భారత్ క్రికెటర్ రాబిన్ ఊతప్పను రూ.3 కోట్లకు, జయదేవ్ ఉనద్కత్‌ను రూ. 3 కోట్లకు రాజస్థాన్ జట్టు దక్కించుకుంది. ఇక, ఆసీస్ క్రికెటర్ అలెక్స్ క్యారీ రూ.2.4 కోట్లకు ఢిల్లీ జట్టు, మరో ఆసీస్ క్రికెటర్ క్రిస్‌లీన్‌ను రూ.2 కోట్లకు ముంబై ఇండయన్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లండ్‌కు చెందిన జాసన్ రాయ్‌ను రూ.1.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్, ఇంగ్లండ్‌కు చెందిన మరో ఆటగాడు క్రిస్ వోక్స్‌ను రూ.1.5 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. అయితే, భారత ఆటగాళ్లు యూసుఫ్ పటాన్, పుజారా, విహారీ, స్టువర్ట్ బిన్నీలపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. కాగా, ఐపీఎల్ 2020 వేలంలో భారత స్పిన్నర్ పీయూష్ చావ్లా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు. చావ్లాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 6.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఏడాది వేలంలో ఇప్పటి వరకూ అత్యధిక ధర పలికిన భారత ఆటగాడు ఇతడే. మరోవైపు ఐపీఎల్ వేలం హాట్‌హాట్‌గా సాగుతోంది.
కాట్రెల్‌కు భారీ ధర..
వెస్టిండీస్ స్టార్ పేసర్ షెల్డాన్ కాట్రెల్‌కు అతని సెలెబ్రేషన్స్ విధానం ఈ వేలంలో బాగానే కలిసొచ్చింది. వికెట్ తీసిన అనంతరం అతడు చేసుకునే ‘సెల్యూట్’ సంబరాల కారణంగానే క్రికెట్ అభిమానులకు తెలిసాడు. మంచి పేస్ బౌలర్ అయిన కాట్రెల్ ఇటీవలి కాలంలో విండీస్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న సిరీస్‌లో ఇతగాడు మోస్తరుగా రాణించాడు. అయినా పలు ఫ్రాంఛైజీలు కాట్రెల్‌కు కోసం పోటీ పడ్డాయి. కింగ్స్ పంజాబ్ ఫ్రాంఛైజీ కాట్రెల్‌ను రూ. 8.50 కోట్లకు కొనుగోలు చేసింది. భారత్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో కాట్రెల్ భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ.. అత్యధిక ధరకు అమ్ముడుపోవడం కొసమెరుపు. వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ షాయ్ హోప్‌ను ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. హోప్ కనీస ధర రూ. 50 లక్షలు ఉన్నా కూడా అతనిపై బిడ్ వేయడానికి ఫ్రాంఛైజీలు దైర్యం చేయలేదు. భారత పర్యటనలో హోప్ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను సైతం కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. స్టెయిన్ కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా.. అతనిపై బిడ్ వేయలేదు. భారత ఆటగాడు మోహిత్ శర్మ, శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ పెరీరా కూడా అమ్ముడు పోలేదు. ఇక దేశవాళీ క్రికెటర్లు రైలీ మీరితీర్థ్, కేసీ కరియప్పలను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. యువ ఆటగాడు కేదార్ దేవధర్, ఆంధ్ర రంజీ జట్టు వికెట్ కీపర్ కేఎస్ భరత్, ప్రభసిమ్రన్ సింగ్, అంకుష్ బెయిన్స్ కొనుగోలు కాలేదు.
దేశవాళీ క్రికెటర్‌కు కోట్లు..
ముంబయి వీధి రోడ్లపై పానీపూరి అమ్మినోడు నేడు కోటీశ్వరుడయ్యాడు. ఈ వేలంలో 17 ఏళ్ల యశస్వి దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతడిపై భారీ అంచనాలు నెలకొనడంతో ఐపీఎల్ వేలంలో మంచి ధర పలుకుతాడని అంతా భావించారు. అనుకున్నట్లుగానే ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ యశస్విని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి. చివరికి రాజస్థాన్ రూ.2.40 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యశస్వి 11 ఏళ్ల వయసులో క్రికెటర్ కావాలనే కోరికతో ముంబయికి చేరుకున్నాడు. ఉండడానికి చోటు లేక ఒక టెంట్‌లో మూడేళ్లు గడిపాడు. ఎండనకా, వాననకా అందులోనే జీవించాడు. సరైన ఆర్థిక వనరులు లేకపోవడంతో బతకడానికి అనేక పనులు చేశాడు. ఆజాద్ మైదానం చుట్టుపక్కల పానీపూరీ, పండ్లు అమ్మేవాడు. ఈ క్రమంలో అదే మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. కాగా, 2015లో పాఠశాల స్థాయిలో జరిగిన గైల్స్ షీల్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు 391 చేయడంతో పాటు అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు 13/99 నమోదు చేశాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి తరఫున ద్విశతకం బాది సంచలనం సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో ద్విశతకం సాధించిన యువ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. 112.80 సగటుతో ఈ టోర్నీలో మొత్తం 564 పరుగులు చేసి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు.
రాబిన్ ఉత్తప్ప జాక్ పాట్..
భారత ప్లేయర్ రాబిన్ ఉతప్పకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఆటలో దూకుడుగా ఆడుతాడు. అయితే ఐపీఎల్ వేలంలో రాబిన్ ఉత్తప్ప జాక్ పాట్ కొట్టాడు. ఈ వేలంలో ఉత్తప్పను రాజస్థాన్ రాయల్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. వెటర్న్ స్పెషలిస్టు ఓపెనర్ అయిన ఉత్తప్పను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. వాస్తవానికి ఈ సారి వేలంలో తను కనీసధరను రూ.1.50 కోట్లకు ఊతప్ప నిర్దేశించుకున్నాడు. అయితే వేలంలో తన పేరు వచ్చిన కాసేపటికి ఫ్రాంచైజీలు తన కోసం పోటీపడ్డాయి. మెల్లిగా తన ధర అమాంత పెరుగుతూ పోయింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ ఉత్తప్పను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంకోవైపు ఈసారి వేలంలో తెలుగు ప్లేయర్ హనుమ విహారి, టెస్టు స్పెషలిస్టు చటేశ్వర్ పుజారాలకు నిరాశ తప్పలేదు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ విహారిని కొనుగోలు చేయగా.. ఈసారి తనకు నిరాశే ఎదురైంది. మరోవైపు పుజారాను కూడా ఈసారి వేలంలో ఎవరూ తీసుకోలేదు.
అన్‌సోల్డ్ జాబితాలో హనుమ విహారి..
హాట కేకుల్ల అమ్ముడు పోతున్న ఆటగాళ్లు.. మరో పక్క కొందరు ఆటగాళ్లు అమ్ముడు పోకుండా ఎదురుచూపులు.. ఈ అన్ సోల్డ్ జాబితాలో ఉండిపోయారు. వారిని కొనుగోలు చేయడానికి ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. అన్ సోల్డ్ లిస్ట్ లో మన తెలుగువాడు ఉన్నాడు. క్రికెటర్ హనుమ విహారిని ఏ జట్టు పట్టించుకోలేదు. హనుమ విహారి బేస్ ప్రైస్ రూ.50లక్షలు. మరో స్టార్ క్రికెటర్, టెస్ట్ స్పెషలిస్ట్ పుజారాకి కూడా చేదు అనుభవమే ఎదురైంది. విహారితో పాటు చతేశ్వర్ పుజారా కూడా అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. పుజారా బేస్ ప్రైస్ రూ.50లక్షలు. యూసుఫ్ పఠాన్, గ్రా్‌ండ హోమ్, స్టువర్ట్ బిన్నీల పేర్లు అన్ సోల్డ్ లిస్ట్ లో ఉన్నాయి. పఠాన్ బేస్ ప్రైస్ కోటి రూపాయలు, గ్రా్‌ండ హోమ్ బేస్ ప్రైస్ 75లక్షలు, బిన్నీ బేస్ ప్రైస్ రూ.50లక్షలు. తెలుగు క్రికెటర్ హనుమ విహారిని ఏ ఫ్రాంచైజీ కూడా పట్టించుకోకవపోవడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువాడికి అన్యాయం జరిగిందనే ఫీలింగ్ లో ఉన్నారు. గతేడాది ఢిల్లీ కేపిటల్స్ విహారిని కొనుగోలు చేయగా.. ఈసారి మాత్రం నిరాశే ఎదురైంది.
వేలంలో చైన్నై, హైదరాబాద్ డీలా..
ప్రతీసారి తెలివిగా ఆలోచించి ఆటగాళ్లను కొనుగోలు చేస్తారు అని పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ వేలంలో కొంచెం తడబడినట్లు కనపడగా పంజాబ్ మరియు ఢిల్లీ జట్టు మాత్రం అదరగొట్టేశాయి అనే చెప్పాలి. పంజాబ్ నూతన హె్‌డ కోచ్ అనిల్ కుంబ్లే ను చాలా తెలివిగా బోల్తా కొట్టిద్దాం అనుకున్న చెన్నై టీం చివరికి వారు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారు పడ్డారు. ఇండియన్ వెటరన్ లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా పేరు దాదాపు అందరూ మర్చిపోయారు. అయితే ఊహించని రీతిలో ఆక్షన్ లో పంజాబ్ మరియు చెన్నై జట్లు అతని కోసం విపరీతంగా పోటీపడ్డాయి. పంజాబ్ కి మంచి లెగ్ స్పిన్నర్ లేడు కానీ చెన్నైకు తాహిర్ మరియు శర్మ ఉన్నప్పటికీ 6.75 కోట్ల వద్ద పంజాబ్ పోటీ నుంచి తప్పుకోవడంతో చెన్నై బృందం మొహం మాడిపోయింది. ఇంగ్లాండ యువ ఆల్రౌండర్ శ్యామ్ కుర్రన్ మరియు ఆస్ట్రేలియా పేసర్ హెజిల్ వు్‌డ ను సొంతం చేసుకునా అందరూ వారి స్థాయి కన్నా చాలా ఎక్కువ మొత్తమే పెట్టారు అంటున్నారు. దానికి తప్ప అంతకు మించి చెన్నై వారు ఇప్పటివరకు వేలంలో చేసింది ఏమీ లేదు. ఇక సన్ రైజర్స్ అయితే అసలు పేరు కూడా తెలియని ఆటగాళ్లను జట్టులోకి తీసుకోగా ఇంగ్లాండ ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన జేమ్స్ నీషమ్ ను వదిలేసి కనుమరుగైపోయిన ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కోసం 2 కోట్లు వెచ్చించారు. మరొకవైపు పంజాబ్ 50 కోట్లకు నీషమ్ ను సొంతం చేసుకోగా కేవలం ఒకటిన్నర కోటి కే ఢిల్లీ జట్టు జేసన్ రాయ్ ను ఎగరేసుకుపోయింది. విండీస్ ఆటగాళ్లు అయిన హెట్ మేయర్ ను 7.75 కోట్లకి ఢిల్లీ సొంతం చేసుకోగా వెస్టిండీస్ భీకర పేసర్ కాట్రెల్ ను పంజాబ్ 8.5 కోట్లకి కొనుగోలు చేసింది. అలాగే తమకు అవసరమైన ప్లేయర్లను వెతికి మరీ మాటేసి అనుభవం మరియు కుర్రకారు కలయికతో ఈ రెండు జట్లు చాలా తెలివిగా కొనుక్కున్నా యి.
కాసులే కాసులు
RELATED ARTICLES