మహిళా పాదచారి మృతి, 9 మందికి గాయాలు
శేరిలింగంపల్లి/హైదరాబాద్ : హైదరాబాద్ గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ పార్కు వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ వంతెనపై మరో విషాదం చోటుచేసుకుంది. ఆ వంతెనపై వేగంగా వెళ్తున్న కారు శనివారం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తెలిపిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాయదుర్గం వైపు నుండి బయోడైవర్సిటీ ఫ్లు ఓవర్‌పై నుండి వోక్స్ వ్యాగన్ కారు (టిఎస్ 09 ఇడబ్ల్యు 5665) హైటెక్ సిటీ వైపు అతి వేగంగా వెళ్తూ అదుపుతప్పి వంతెన పైనుంచి కింద పడింది. అక్కడ ఆటోస్టాండ్‌లో కోసం నిరీక్షిస్తున్న వసల సత్యవేణి (56), ఆమె పెద్ద కూతురు ప్రణీతలపై పడడంతో సత్యవేణి తీవ్ర గాయలతో అక్కడిక్కడే మృతి చెందగా ప్రణీతతో సహా మరో 9 మంది గాయలయ్యాయయి. ప్రమాదంలో చెట్టు నేలకూలడంతో పాటు మరో కారు ధ్వంసమైంది. మృతి చెందిన మహిళ పశ్చిమ గోదావరి,పెంటపాడు గ్రామం. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అతి వేగమే ప్రమాదానికి కారణమన్నారు. ఫ్లువర్ ప్రారంభమయ్యాక ఇది రెండో ప్రమాదమన్నారు. వంతెనను తాత్కాలికంగా కొద్ది రోజులు మూసివేస్తామని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మృతురాలి కుటుంబానికి రూ.5లక్షల నష్ట పరిహారం: మేయర్ రామ్మోహన్
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుండి ప్రమాదవశాత్తు కారు పడ్డ ఘటనలో మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియాను నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై వేగాన్ని నియంత్రించేందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు మూడు రోజుల పాటు ఈ వంతెనపై రాకపోకలను నిషేధిస్తున్నట్టు మేయర్ స్పష్టం చేశారు. కాగా ఈ సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పరామర్శించారు. సంఘటన జరిగిన అంశాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే డిజాస్టర్ రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలను చేపట్టాయి. ఇదిలా ఉండగా, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నియమ నిబంధనల ప్రకారమే నిర్మించారు. అయినప్పటికీ ఈ వంతెనపై 40 కిలోమీటర్ల వేగం మాత్రమే ఉండాలని సైనేజి ఏర్పాటు చేసినప్పటికీ వాహనదారులు 90 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తున్నారు. నేడు జరిగిన ప్రమాద సంఘటన కూడా 90 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడమే కారణంగా అధికారులు స్పష్టం చేశారు. ఈ ఫ్లైఓవర్‌ను ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నియమనిబంధనల ప్రకారంగానే నిర్మించడంతో పాటు ప్రమాణాలు పాటించినప్పటికీ ఈ వంతెనపై వేగాన్ని మరింత నియంత్రించేందుకుగాను తగు చర్యలను చేపట్టేందుకు కనీసం మూడు రోజులపాటు ఈ వంతెనను మూసివేయాలని నిర్ణయించారు. ఇటీవలే ఈ వంతెన దగ్గర సెల్ఫీ తీసుకుంటూ జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో సెల్ఫీల నిషేధంతో పాటు 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలని కోరుతూ ఫ్లైఓవర్ పై సైన్ బోర్డులను ఏర్పాటు చేశామని జిహెచ్ఎంసి అధికారులు తెలిపారు. అయినప్పటికీ నిబంధనలను కాతరు చేయకుండా అతివేగంతో ప్రయాణించడంతోనే నేటి ప్రమాదం జరిగిందని జిహెచ్ఎంసి అధికారులు స్పష్టం చేశారు.