ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పోలీసుల లాఠీచార్జీకి జెఎసి నిరసనగా ఆందోళన
ప్రజాపక్షం / హైదరాబాద్: ఆర్టీసీ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆర్టీసీ జెఎసి నేతలు విమర్శించారు. ఇటీవల చేపట్టిన చలో ట్యాంక్ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులపై జరిగిన పోలీసుల లాఠీ చార్జీని నిరసిస్తూ ఆర్టీసీ జెఎసి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడిని నిర్వహించింది. వామపక్షాల కార్యకర్తలతో కలిసి ఆర్ కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎంఎల్ ఎంఎల్ ఇళ్ల వద్ద ఆందోళనకు దిగారు. కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు. మరోవైపు పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తోపులాట ఏర్పడింది. హన్మకొండలోని రాంనగర్ ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ నివాసాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కార్మికులను, నాయకులను అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.