హీరో శ్రీవిష్ణు
సొంత టాలెంట్‌తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో శ్రీ విష్ణు. ఏరీకోరి తనకు నచ్చిన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. వైవిధ్యమైన సినిమాల్లో అభిమానులను ఎంటటైన్మెంట్ చేస్తూ దూసుకెళుతున్నారు. ఆయన ప్రస్తుతం ’అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహించిన ’తిప్పారా మీసం’లో నటించారు. ఈ సినిమా నవంబర్ 8న విడుదల కానుంది. కాగా ఈ సందర్భంగా శ్రీక విష్ణు హైదరాబాద్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమై విశేషాలను వారితో పంచుకున్నారు.
మీసం.. బాధ్యత యొక్క చిహ్నం
మీసం అనేది బాధ్యత యొక్క చిహ్నంగా చెప్పొచ్చు. పూర్వం రాజులు పెద్ద మీసాలను పండించేవారు, పాలకులుగా తమకు భారీ బాధ్యత ఉందని చూపిస్తుంది. ఒక మనిషి తన విధులను, బాధ్యతలను నిర్వర్తించినప్పుడే ఇతరుల ముందు గర్వంగా తన మీసాలను తిప్పగలడు. ఈ పాయింట్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాం.
తల్లి సెంటిమెంట్
ఈ సినిమాలో సుదీర్ఘమైన డైలాగ్‌లు మరియు యాక్షన్ సన్నివేశాలు ఏమి లేవు. కానీ, నేను నైట్ క్లబ్లో పనిచేసే వ్యక్తిగా నటించాను. నా పాత్రకు భిన్నంగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది. చాలా కామేడీగా అందరినీ నివ్విస్తుంది. ఈ చిత్రంలో మంచి తల్లి సెంటిమెంట్, వాణిజ్య అంశాలు ఉన్నాయి. కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉటంటుంది
ఆలస్యం కారణం
ఈ చిత్రం షెడ్యూల్ ప్రకారం ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కొంత ఆలస్యం జరిగింది. ’బ్రోచెవరేవరురా’ తర్వాత వెంటనే దాన్ని విడుదల చేద్దామనుకున్నాం. కానీ, ’సాహో’,’సైరా’ వంటి పెద్ద సినిమాలు ఉండటంతో ఈ సినిమాపై ప్రభావం ఉటుందని వాయిదా వేసుకున్నాము. దీంతో ఈ సినిమా విడుదలకు కాస్తా ఆలస్యమైంది.
మంచి సంబంధం
దర్శకుడు కృష్ణ విజయ్. నేను మంచి స్నేహితులం ఆయనతో నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. నేను సమయానికి సెట్స్‌కి వెళ్లి, ఆయనకు కావాల్సిన విధంగా పాత్రలో ఒదిగిపోయి నటిస్తాను. దీంతో అతను నాతో పనిచేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ముందు కూడా మేమిద్దరం కలిసి పనిచేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు.
పారితోషికం కొంచెం పెంచాను..
’బ్రోచెవరేవరురా’ విడుదలకు ముందే నేను నాలుగు సినిమాలకు సంతకం చేశాను. ఆ చిత్రాలకు నా పారితోషికం పెంచలేదు. కానీ, ముందు సినిమాలను దృష్టిలో పెట్టుకుని నా పారితోషికాన్ని పెంచాను.
రోహిణీగారితో కలిసి నటించడం..
ఈ సినిమాలో నా తల్లిగా రోహిణి గారు నటించారు. ఆమె సన్నివేశానైనా సింగిల్ టేక్‌లో చేసేస్తుంది. ఆమెపై గౌరవంతో మొదట్లో ఆమెతో పనిచేయడానికి కొంత భయపడ్డాను. ఆమెతో పనిచేయడం ప్రారంభించిన తరువాత, నా భయం పోయింది. ఆమె కలిసి నటించడం చాలా గర్వంగా ఫీల్ ఆవుతున్నాను. నేను ఇప్పటి వరకు పనిచేసిన ఉత్తమ నటి ఆమె.
తదుపరి సినిమాలు ఇవే..
ప్రస్తుతానికి మూడు సినిమాలు సంతకం చేవాను. అయితే మొదట ఏ చిత్రం సెట్స్‌కి వెళ్తుందో నాకు తెలియదు. వాటి కోసం నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నా.
మీసం.. బాధ్యత తెలుపుతోంది
RELATED ARTICLES