బుకీలతో సంబంధాలున్నాయని తేలడంతో రెండేళ్లు నిషేధం విధించిన ఐసిసి
దుబాయి: ఇండియా పర్యటనకు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జట్టు టీ-20, టెస్ట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది. అవినీతి కేసులో జరిగిన విచారణలో షకీబ్ తాను తప్పు చేసినట్లు అంగీకరించడంతో ఈ శిక్షను ఖరారు చేసింది. రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. ఇందులో ఒక ఏడాది పాటు అతనిపై సస్పెన్షన్ ఉండనుంది. బంగ్లాదేశ్ క్రికెట్ లో స్టార్ హోదాలో కొనసాగుతున్న షకీబ్ అల్ హసన్‌ని రెండేళ్ల క్రితం ఓ బుకీ కలిశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ విషయమై అతనితో మాట్లాడిన బుకీ పెద్ద మొత్తంలో డబ్బులు ఆఫర్ చేసినా షకీబ్ తిరస్కరించాడు. అయితే బుకీ తనని కలిసిన విషయాన్ని మాత్రం ఐసీసీ అవినీతి నిరోధక శాఖకి మాత్రం ఇన్నాళ్లు షకీబ్ చెప్పలేదు. తాజాగా సదరు బుకీ కాల్ రికారడ్స్‌ని ఐసీసీ పరిశీలించగా షకీబ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఐసీసీ విచారణ జరపగా షకీబ్ తన తప్పిదాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడ్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధం విధించాలని ఐసీసీ నిర్ణయించగా రంగంలోకి దిగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శిక్ష తగ్గించే దిశగా పావులు కదిపింది అయినా వెనక్కి తగ్గని ఐసీసీ రెండు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
షకీబ్‌పై సస్పెన్షన్‌కి కారణాలు..
బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే ట్రై సిరీస్(జనవరి 2018) లేదా 2018 ఐపీఎల్ సమయంలో
ఆ ట్రై సిరీస్‌లో బుక్కీ షకీబ్‌తో బేరాలు ఆడాడు.
ఆ తర్వాత ఐపీఎల్ 2018లో సన్‌రైజర్స్, కింగ్స్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్(26 ఏప్రిల్)లో షకీబ్‌తో బుక్కీ చర్చలు జరిపాడు.