దుబాయి: వచ్చే ఏడాది జనవరి 17 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు జనవరి 19న శ్రీలంకతో తలపడనుంది. ఇప్పటికే భారత జట్టు నాలుగు సార్లు అండర్-19 వరల్డ్‌కప్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. న్యూజిలాండ్ శ్రీలంక, జపాన్‌లతో పాటు భారత క్రికెట్ జట్టు గ్రూప్-ఏలో ఉంది. ఈ టోర్నీలో మొదటిసారి జపాన్ తలపడుతోంది. భారత క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుండగా… ఆ తర్వాత జనవరి 21న జపాన్‌తో, జనవరి 24న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
ఫిబ్రవరి 9న ఫైనల్
ఫిబ్రవరి 9న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, గత సీజన్లో రన్నరప్, మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌లో వెస్టిండిస్‌తో తలపడనుంది. ఆస్ట్రేలియా, వెస్టిండిస్, ఇంగ్లాండ నైజీరియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, స్కాట్లాండ జట్లు గ్రూప్ సీలో ఉన్నాయి. కాగా, వరల్డ్ప్కు ఆతిథ్యమిస్తోన్న దక్షిణాఫ్రికా తన ఆరంభ మ్యాచ్‌లో జనవరి 17న ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. దక్షిణాఫ్రికాతో పాటు గ్రూప్ డీలో యుఏఈ, కెనడా జట్లు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ 13వ సీజన్ కావడం విశేషం. ఈ సీజన్ రెండో అర్ధభాగం సూపర్ లీగ్ మాదిరి జరగనుంది. నాలుగు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన మొదటి రెండు జట్లు సూపర్ లీగ్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ లీగ్ తర్వాత ప్లేట్ ఛాంపియన్షిప్ తరహాలో జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. పోట్చెఫ్‌స్ట్రూమ్‌లోని జెబి మారక్స్ ఓవల్ స్టేడియం రెండు సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్‌కు తోడు సెమీ ఫైనల్స్ మరియు ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న స్టీవ్ స్మిత్, వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ టెస్టు కెప్టెన్ జో రూట్, న్యూజిలా్‌ండ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసినవారే కావడం విశేషం. జనవరి 12 నుంచి 15 వరకు వార్మప్ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాకు చెందిన గ్రేమ్ స్మిత్, హషీమ్ ఆమ్లా, డీన్ ఎల్గర్, వేన్ పార్నెల్, క్వింటన్ డీ కాక్, కగిసో రబాడ వంటి ఆటగాళ్ళు అండర్-19లో అందరి దృష్టిని ఆకర్షించి ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో రాణించారు. టోర్నీలో పాల్గొనే 16 జట్లు జనవరి 12 నుంచి 15 వరకు జోహెన్స్‌బర్గ్, ప్రిటోరియో వేదికగా వార్మప్ మ్యాచ్‌లు ఆడతాయి.
గ్రూప్-ఎ: ఇండియా, న్యూజిలాండ్ శ్రీలంక, జపాన్
గ్రూప్-బి: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, నైజీరియా
గ్రూప్-సి: పాకిస్థాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, స్కాట్లాండ్
గ్రూప్-డి: ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా, యుఎఇ, కెనడా.
అండర్-19 వరల్డ్‌కప్ ఎప్పుడంటే..
RELATED ARTICLES