కార్యదర్శిగా జైషా, బ్రిజేశ్‌కు ఐపిఎల్ పగ్గాలు
గంగూలీకి సహచరుల ప్రశంసలు
ముంబయి : బిసిసిఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే. అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. ఆదివారం ఉదయం వరకు బ్రిజేష్ పటేల్ అధ్యక్షుడు పదవికి ముందు వరుసలో ఉన్నాడు. అయితే, కొన్ని గంటల్లోనే పరిస్థితులు గంగూలీకి అనుకూలంగా మారిపోయాయి. అనూహ్యాంగా తెరపైకి గంగూలీ పేరు వచ్చింది. ఒక్క రోజు తిరిగేసరికి బోర్డు అధ్యక్షుడిగా అతడి ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది. గంగూలీతో పాటు కార్యదర్శి పదవికి జైషా (కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు), మహిమ్ వర్మ (ఉపాధ్యక్షుడు), అరుణ్ సింగ్ ధూమల్ (ట్రెజరర్), బ్రిజేష్ పటేల్ (ఐపిఎల్ ఛైర్మన్), జయేష్ జార్జ్ (జాయింట్ సెక్రటరీ), ఖైరుల్ మజుందార్ (కౌన్సిలర్), ప్రభ్‌జ్యోత్ సింగ్ (కౌన్సిలర్) కూడా నామినేషన్లు వేశారు. వీళ్లందరి ఎన్నిక కూడా ఏకగ్రీవమేనని తెలుస్తోంది. బీసీసీఐ ఎన్నికల అధికారి ఎన్ గోపాలస్వామి సైతం వీరి నామినేషన్లను ధృవీకరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ కొత్త టీమ్ ఫోటోను సౌరవ్ గంగూలీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ‘మేము బాగా పనిచేయగలమని ఆశిస్తున్నాను‘ అని కామెంట్ పెట్టాడు. ఈ ఫోటోలో బీసీసీఐ మాజీ బీసీసీఐ ఆధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు. కాగా కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ సెక్రటరీ పదవి చేపట్టనుండగా, అరుణ్ దుమాల్ బీసీసీఐ ట్రెజరర్ బాధ్యతలు చేపట్టనున్నారు. మహిమ్ వర్మ బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, జయేష్ జార్జి జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
టీమిండియా మరింత అభివృద్ధి
మరికొద్ది రోజుల్లో బిసిసిఐ నూతన అధ్యక్షుడిగా నియమితమయ్యే టీమిండియా మాజీ సారథి, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి నాటి సహచరులు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేస్తూ ’కంగ్రాట్స్ గంగూలీ. మీ నేతృత్వంలో భారత క్రికెట్ మరింత వృద్ధి చెందుతుందని చెప్పడంలో నాకెలాంటి సందేహం లేదు. కొత్త బాధ్యతల్లో మీరు అన్నీ విజయాలే సాధించాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇక మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ..’భారత క్రికెట్‌కు ఇది శుభసూచికం. ఇదివరకే టీమిండియాకు ఎనలేని సేవలు అందించిన దాదా కొత్త బాధ్యతల్లో మరింత ముందుకు సాగాలి’ అని ఆకాంక్షించాడు. ఇదిలా ఉండగా గంగూలీ సోమవారం బీసీసీఐ కార్యాలయంలో అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశాడు. ఆయన ఒక్కరే ఈ పదవికి పోటీచేయడంతో ఎన్నిక లాంఛనం కానుంది. ఈ నెల 23న గంగూలీ అధికారికంగా బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికయినట్టు ప్రకటించనున్నారు.
గొప్ప విషయం..
బిసిసిఐ అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్ వేయడం తనకు సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ చీఫ్ వినోద్‌రాయ్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన దాదా నామినేషన్ వేశాడని తెలిసి మీడియాతో మాట్లాడారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పాలకుడిగా, టీమిండియా అత్యుత్తమ కెప్టెన్‌గా పనిచేసిన గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా నియామకం అయితే అది గొప్ప విషయమని పేర్కొన్నారు. అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఐసిసి మాజీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్, ఐపిఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్‌శుక్లాల గురించి మీడియా ప్రశ్నించగా.. గతం గురించి తనకు తెలియదని, భవిష్యత్‌వైపే తన దృష్టి అని తెలిపారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ సోమవారం ముంబయిలోని ఆ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఒక్కరే పోటీ చేస్తుండడంతో దాదా ఎన్నిక లాంఛనమే. ఈ నెల 23న గంగూలీ ఎన్నికను ప్రకటించనున్నారు. అయితే దాదా వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగనున్నాడు. గత ఐదేళ్లుగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో మరో పది నెలలు మాత్రమే బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేస్తాడు. సోమవారం మీడియాతో మాట్లాడిన దాదా.. తానెప్పుడూ ఈ పదివి గురించి ఆలోచించలేదని, భారత క్రికెట్‌కు తన వంతు కృషి చేయడానికి ఇదో మంచి అవకాశమని చెప్పాడు. ఈ విషయంపట్ల సంతోషంగా ఉన్నానని తెలిపాడు. బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌పై దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చాడు.
దాదా టీమ్ రెడీ!
RELATED ARTICLES