కూడళ్లలో అత్యాధునిక కెమెరాలు
దూరంగా ఉన్న వాహనాల నెంబర్లను సైతం గుర్తించే సాంకేతికత
సిటీబ్యూరో : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వాహనదారుల భరతం పట్టేందుకు హైదరాబాద్ మహానగరంలోని పలు కూడళ్లలో అత్యాధునిక కెమెరాల ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ కెమెరాలను ప్రధాన కూడళ్లలో పాటు, రద్దీ అధికంగా ఉండే కూడళ్లలో ఏర్పాటు చేశారు. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ కెమెరాలు దూరంలో ఉన్న వాహనాల నెంబర్లను సైతం గుర్తించే సాఫ్ట్‌వేర్ కలిగిఉన్నాయి. కూడళ్లలో ఎవరైన వాహనదారుడు సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్‌సైడ్‌లో వెళ్లినా ఈ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వాహనదారులకు చాలాన్ల వాత పడుతోంది. మహానగరంలో కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించడం పారిపాటిగా మారింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారుల తాలుకు ఫొటోలను ట్రాఫిక్ పోలీసులు హ్యండ్ కెమెరాల ద్వారా తీసి వారి ఇళ్లకు చాలానాలు పంపుతున్నారు. కొంతమంది వాహనదారులు వాహనాల నెంబర్ ప్లేట్లలో ఒక నెంబర్ చెరిపేయడం, మరికొందరు నెంబర్‌ను తప్పుగా రాయడం చేస్తున్నారు. దీంతో ఇ వేరే వాహనదారుల ఇళ్లకు వెళ్లుతున్నాయి. దీంతో బాధితులు ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం, ఫిర్యాదు చేయడం చేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడళ్లలో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు నిబంధనలు ఉల్లఘించే వారి వాహనాలు రెడ్ లైట్ దాటి 20 మీటర్ల దూరం వెళ్లినా అవలీలగా చిత్రీకరిస్తాయి. ఈ కెమెరాలో ఉన్న ప్రత్యేక పరిజ్ఞానంతో నెంబర్ ప్లేటును స్పష్టం కనిపించేలా చేసి ఆ ఫోటోను ఇ విభాగానికి పంపుతాయి. అదేవిధంగా ఈ కెమెరాల సాఫ్ట్‌వేర్‌లో రవాణాశాఖ సర్వర్‌లోని వాహనాల నెంబర్లన్నీ చేర్చనున్నారు. ఈ కెమెరా మొదటి ప్రాధాన్యత వాహనాల ఫొటోలు తీయడం, రెండవ ప్రాధాన్యత వాహనాల విశ్లేషణ చేయడం. రవాణా శాఖ సర్వర్‌ను కెమెరా సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించడం ద్వారా రవాణాశాఖ వాహనానికి కేటాయించిన నంబర్ ఈ సాఫ్ట్‌వేర్ వెంటనే గుర్తిస్తోంది. వేరే నంబర్‌తో ఆ వాహనం వెళ్లుంటే వెంటనే ఈ కెమెరాలు గుర్తించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందిస్తాయి. సిగ్నల్ వద్ద వాహనం ఉన్న ప్రదేశాన్ని అక్షాంశాలు, రేఖాంశాలతో సహా వివరించడం ఈ కెమెరాలలో మరో ప్రత్యేకత అని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
గీత దాటితే వాతే…
RELATED ARTICLES