లండన్ : గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు శనివారం లండన్‌లోని వైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని పాండ్యానే స్వయంగా తన ఇనిస్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్ ఆడుతుండగా హార్దిక్ వెన్ను గాయంతో బాధపడ్డాడు. నొప్పి భరించలేక నేలపై విలవిల్లాడిన సంగతి తెలిసిందే. అయితే, వెన్నునొప్పి గాయం మళ్లీ తిరగబెట్టడంతో పాండ్యాను బీసీసీఐ ఇటీవలే సర్జరీ నిమిత్తం లండన్‌కు పంపింది. ఆసియా కప్ తర్వాత తొలిసారి గాయపడినప్పుడు ఎవరైతే డాక్టర్ పాండ్యాకు చికిత్స అందించాడో అదే వైద్యుడు మళ్లీ హార్దిక్ పాండ్యాకు శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
వెన్నుకు గాయం.. సర్జరీ
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరిస్‌లో పాల్గొన్న పాండ్యా నేరుగా లండన్‌కు బయల్దేరి వెళ్లాడు. అక్కడ సర్జరీ విజయవంతంగా పూర్తున విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నాడు. ‘నా సర్జరీ విజయవంతం అయింది. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే జట్టుతో కలుస్తా, కానీ సమయం తెలియదు. అప్పటివరకూ నన్ను మిస్సవుతారు‘ అంటూ కామెంట్ పెట్టాడు. సఫారీలతో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న హార్దిక్‌ను వెన్నునొప్పి గాయంతో సతమతమయ్యాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కూడా హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకోలేపోయాడు. కూర్పులో భాగంగా హార్దిక్ టెస్టు సిరీస్‌కు ఎంపికవ్వని సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2020 ప్రారంభమయ్యే నాటికి జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి.
పాండ్యకు సర్జరీ సక్సెస్
RELATED ARTICLES