రూపాయి కోసం కూతురుకు వాతలు పెట్టిన కన్నతల్లి
ప్రజాపక్షం/కారేపల్లి : కేవలం ఒకేఒక్క రూపాయి బిళ్ల దొంగిలించిందని ఓ కన్న తల్లి తన కూమార్తెకు కట్టెలతో వాతలు పెట్టిన అమానుష సం ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని పేరుపల్లిలో జరిగింది. సిరికొండ నాగమణి కూతురు కృష్ణవేణి అదే ఊర్లో ఐదవ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం ఇంట్లో రెండు రూపాయలు తీసి తినే వస్తువులు కొనుగోలు చేసిందని ఆ తల్లి తీవ్ర ఆగ్రహంతో పొయ్యిలో మండుతున్న కట్టెను తీసి చేతిమీద, కాలి తోడ మీద వాతలు పెట్టింది. బాలిక అరుపులకు చుట్టు పక్కల వారు వచ్చి ఆ పాపను రక్షించే ప్రయత్నం చేశారు. బాలిక శరీరం పై వాతలు పెట్టిన విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ టీచర్ ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. స్థానికులు కొందరు కృష్ణవేణి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.