ప్రజాపక్షం/అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో కలశాలతో నీరు తెచ్చి, అమ్మవారిని అభిషేకించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని దుర్గాదేవి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి, కుంకుమ పూజలు నిర్వహించారు. అన్నవరం క్షేత్రపాలకులు వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లు బాలా అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తణుకులో గోస్తనీ నదీతీరంలో ఉన్న అమ్మవారు సంతోషిమాత అలంకారంలో పూజలు అందుకొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని దుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
వైభవంగా దసరా ఉత్సవాలు
RELATED ARTICLES