వైద్య ఆరోగ్య, సాంఘిక సంక్షేమం, విద్యపట్ల నిర్లక్ష్యం
ప్రభుత్వ రుణాల ప్రమాదావకాశాలపై అధ్యయనం అవసరం : కాగ్ నివేదిక వెల్లడి
హైదరాబాద్ :రాష్ట్రంలో 19 సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తొలి అంచనా వ్యయం రూ.41.201 కోట్లు కాగా, 3 నుంచి 11 ఏళ్ల వరకు జరిగిన జాప్యం కారణంగా ప్రాజెక్టుల వ్యయం రూ.1,32,928 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టుల మీద ఇప్పటి వరకు రూ.70.758 కోట్లు ఖర్చయినా అవి ఇం కా పూర్తి కాలేదు. సాగు నీటి ప్రాజెక్టుల ఆర్థిక ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ విషయాన్ని 2018 మార్చితో ముగిసిన సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించింది. 2016- సంవత్సరం తప్ప ప్రాజెక్టుల నిర్ల్యక్షానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభత్వం 2014- మధ్య కాలంలో రూ.79,236 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. నీటి పారుదల రంగం మీద పెడ్తున్న భారీ పెట్టుబడుల వల్ల ఏర్పడిన ప్రయోజనాలను మదింపుచేసి వాటి ఫలితాలను సంకలనం చేయాలని కాగ్ హితవు పలికింది. బడ్జెట్లో కేటాయింపులు భారీగా చూపి, వాటిని విడుదల చేయకుండా లేదా ఖర్చు చేయకుండా మిగుళ్లుగా చూపుతున్న విషయాన్ని కాగ్ ప్రస్తావించి 2017- మొ త్తం మిగుళ్లు రూ.58.614 కోట్లని వివరించింది.వైద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమ విభాగాల కింద పదే పదే మిగుళ్లు ఏర్పడడం ఈ శాఖల్లోని పథకాలకు ప్రభుత్వం నుంచి తగినంత ప్రాధాన్యత అందక పోవడా న్ని, అమలులో సద రు శాఖల, అమలు సంస్థల అసమర్థతను సూచిస్తుందని కాగ్ నిర్ధారించింది. బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు మధ్య అంతరం తగ్గే విధంగా బడ్జెట్ తయారీ ప్రక్రియను ఆర్థికశాఖ హేతుబద్ధం చేయాలని అది సూచించింది. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే రుణాలకు సంబంధించిన ప్రమాదావకాశాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కూడా కాగ్ హెచ్చరించింది.
అంచనాలకు, వాస్తవాలకు మధ్య అంతరం
RELATED ARTICLES