కెంటో మొమోటా చేతిలో పరాజయం
చైనా ఓపెన్‌లో ముగిసిన భారత పోరు
ఇంచియాన్: కొరియా ఓపెన్ వరల్ టూర్ సూపర్-500 టోర్నీలో భారత పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో కశ్యప్ 13–21, 15-21 తేడాతో ప్రపంచ చాంపియన్ కెంటో మొమాటా(జపాన్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి గేమ్‌ను 13-21తో కోల్పోయిన కశ్యప్… రెండో గేమ్‌లోనూ పుంజుకోలేకపోయాడు. దీంతో రెండో గేమ్‌లో 15–21 ఓడిపోయి మ్యాచ్‌ని సైతం చేజార్చుకున్నాడు. వీరిద్దరి మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా రెండు మ్యాచ్‌ల్లోనూ మొమాటా విజయం సాధించడం విశేషం. కేవలం 40 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించిన మొమొటా ఫైనల్లోకి ప్రవేశించాడు. కశ్యప్ ఓటమితో కొరియా ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఇప్పటి వరకు వీరిద్దరు తలపడిన మూడు సార్లు జపాన్ ప్లేయర్‌దే పైచేయి కావడం గమనార్హం.
సెమీ ఫైనల్లో కశ్యప్ ఓటమి
RELATED ARTICLES