వామఫ్ మ్యాచ్ డ్రా
అర్ధ శతకాలతో రాణించిన పాంచల్, శ్రీకర్, సిద్దేశ్ లాడ్
డకౌట్‌గా వెనుదిరిగిన రోహిత్ శర్మ
విజయనగరం : బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. శనివారం ఆట ముగిసేసమయానికి బోర్డు ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఎలెవన్ ఇన్నింగ్స్‌లో ప్రియాంక్ పాంచల్(60), శ్రీకర్ భరత్(71), సిద్దేశ్ లాడ్(52) అర్ధశతకాలతో రాణించారు. వామప్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన రోహిత్ శర్మ కేవలం రెండు బంతులే ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫిలాండర్ బౌలింగ్‌లో కీపర్ క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ నిష్క్రమించాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా సత్తాచాటాలని భావిస్తున్న హిట్‌మ్యాన్ సన్నాహక మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. దురదృష్టవశాత్తు స్వల్ప వ్యవధిలోనే ఔటవడంతో నిరాశగా వెనుదిరిగాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బావుమా(87 నాటౌట్), ఫిలాండర్(48) దూకుడుగా ఆడటంతో 64 ఓవర్లలో 6 వికెట్లకు సౌతాఫ్రికా 279(వద్ద డిక్లేర్) పరుగులు చేసింది.
రోహిత్ శర్మ డకౌట్…
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ శనివారం డకౌట్‌గా వెనుదిరిగాడు. వెర్నన్ ఫిలాండర్ బౌలింగ్‌లో ఆడిన రెండో బంతికే రోహిత్ ఔటయ్యాడు. టెస్టుల్లో ఇదివరకు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఆడిన హిట్‌మ్యాన్‌కు సరైన అవకాశాలిచ్చి ఓపెనర్‌గా దించి చూస్తామని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొనడంతో అతడిపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సన్నాహక మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేయగా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. తెంబా బవుమ 87 నాటౌట్‌గా నిలవగా ఫిలాండర్ ధాటిగా ఆడి 48 పరుగులు చేశాడు. ధర్మేంద్రసిన్హ్ జడేజా ఆరో వికెట్‌గా ఫిలాండర్‌ను ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు బ్యాటింగ్ ఆరంభించింది. గురువారం తొలి రోజు వర్షార్పణం కాగా రెండో రోజూ ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. శుక్రవారం 50 ఓవర్ల పా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్‌క్రమ్ శతకం చేయడం విశేషం. ఇక బోర్డ్ ప్రెసిడెంట్స్ జట్టులో స్పిన్నర్ ధర్మంద్రసిన్హ్ జడేజా మూడు వికెట్లతో రాణించాడు.
హిట్ మ్యాన్‌పై ఫన్నీ కామెంట్లు
ఎర్రబంతి క్రికెట్‌లో తన అదృష్టాన్ని ఓపెనర్‌గా పరీక్షించుకునే క్రమంలో ఆదిలోనే చుక్కెదురైంది. మూడో రోజు ఆటలో భాగంగా బోర్డు ప్రెసిడెంట్స్ బ్యాటింగ్‌కు దిగగా ఇన్నింగ్స్‌ను మయాంక్ అగర్వాల్, రోహిత్‌లు ఆరంభించారు. ఫిలిండర్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికి రోహిత్ పెవిలియన్ చేరాడు. క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో రోహిత్ ఇన్నింగ్స్ సున్నా వద్దే ముగిసింది. రోహిత్ పేలవ ప్రదర్శనపై అప్పుడే సోషల్ మీడియలో సెటైర్ల వర్షం మొదలైంది. ‘ అసలు రోహిత్ టెస్టుల్లో డకౌట్‌గా అవ్వడం కం ఓపెనర్‌గా రావడమే ఫన్నీగా ఉంది’ అని ఒక అభిమాని ట్వీట్ చేయగా, ‘అసలు సిరీస్ ఇంకా ఆరంభం కాకుండానే రోహిత్ శర్మ డకౌట్లు మొదల్టేశాడు’ అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. ఇది రోహిత్‌కు మరో ‘డబుల్ సెంచరీ’ అని మరొకరు ఎద్దేవా చేశారు. ‘రోహిత్ డబుల్ సెంచరీ చేయడానికి ఇంకా రెండొందల పరుగులు తక్కువ అయ్యాయి’ అని మరొక నెటిజన్ పేర్కొన్నాడు.
తేలని ఫలితం
RELATED ARTICLES