ప్రజాపక్షం / హైదరాబాద్: తెలంగాణ దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ( టిఎస్‌ఎస్‌పిడిసిఎల్)లో ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. 2438 జూనియర్ లైన్‌మెన్లు, 24 జూనియర్ పర్సనల్ ఆఫీసర్లు, 477 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను అక్టోబర్ 10 నుంచి http://tssouthernpower.cgg.gov.inలో చూసుకోవచ్చు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పోస్టులు ఖాళీలు
జూనియర్ లైన్‌మెన్ 2438
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 24
జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ 477