కమెడియన్ వేణుమాధవ్ కన్నుమూత
గత కొంతకాలంతో అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు
సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి
ప్రజాపక్షం/ సినిమా: ప్రముఖ టాలీవుడ్ కమేడియన్ కమ్ హీరో వేణు మాధవ్ బుధవారం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో.. పాటుగా కిడ్నీ సమస్య కూడా ఉండటంతో.. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించి మరణించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాధవ్ జన్మించారు. వేణుమాధవ్ భార్య శ్రీవాణి, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన.. ’సంప్రదాయం’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. నాలుగో ఏట నుంచే ఆయన మిమిక్రీ చేయడం ప్రారంభించారు. కాగా.. ’లక్ష్మీ’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు. సినిమాలతో పాటు పలు టీవీ ప్రోగ్రాములు కూడా చేశారు. అయితే.. హాస్యనటుడిగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన వేణుమాధవ్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మిమిక్రీ కళాకారుడైన ఆయన ‘మహానాడు’లో ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు. అదే వేణుమాధవ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎన్‌టిఆర్‌ను కలిసే అవకాశం రావడం, టిడిపి ఆఫీస్‌లో ఉద్యోగం రావడం గురించి వేణు మాధవ్ గొప్పగా చెప్పుకొనేవారు.
టెలీకాలర్‌గా జాబ్
అప్పట్లో నేను కోదాడలో టాకింగ్ డాల్ ప్రోగ్రాం చేసేవాడు. దాన్ని అప్పటి మంత్రి మాధవరెడ్డి చూశారు. భువనగిరిలో తెదేపా నిర్వహించే మహానాడులో ఓ ప్రదర్శనలో ఇవ్వాలని అతన్ని పిలిచారు. అక్కడ కార్యక్రమాన్ని చూసిన చంద్రబాబు నాయుడు గారు మరో చోట జరిగే మహానాడులోనూ చేయాలని కోరారు. దాంతో వేణును సెక్రటేరియట్ పక్కన ఉన్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ‘మహానాడు’కు మధ్యాహ్నం 12 గంటలకు తీసుకెళ్లారు. సాయంత్రం అవుతున్నా ఎంతసేపటికీ వేణును పిలవకపోవడంతో చాలా కోపం వచ్చి వెళ్లి పోవాలనుకున్నాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరికి చంద్రబాబునాయుడు గారు కూడా మాట్లాడారు. ఇక చివరిగా ఎన్‌టిఆర్ మాట్లాడాల్సి ఉంది. ఆ సమయంలో చంద్రబాబుగారు అతన్ని స్టేజ్ పైకి పిలిచి ప్రోగ్రాం చేయమన్నారు. అది చూసిన ఎన్‌టిఆర్ వేణును మెచ్చుకుని, ‘మీరు మాతో ఉండాలి. మీ సేవలు ఎంతో అవసరం బ్రదర్’ అని అన్నారు. మంచి జీతం దొరుకుతుందని అనుకున్నా వేణుకు చివరకు నన్ను హిమాయత్‌నగర్ తెదేపా కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్‌గా పెట్టారు. ఏవైనా ఫోన్ కాల్స్ వస్తే, ఎన్‌టిఆర్‌గారికి ఇవ్వాలి. అదే నా ఉద్యోగం. నెలాఖరున మంచి జీతం వస్తుందని అనుకున్నాడు. కానీ రూ.600 జీతం.. ఆ డబ్బు ఖర్చులకు సరిపోకపోవడంతో హైదరాబాద్‌లో ఉన్న ఆర్కెస్ట్రా వాళ్లతో కలిసి వేణు మాధవ్.. మిమిక్రీ ఆర్టిస్ట్’ అని విజిటింగ్ కార్డు చేయించి, దానిపై తెదేపా ఆఫీస్ నెంబరు ఇచ్చాడు. దీంతో వచ్చే పది ఫోన్ కాల్స్‌లో తొమ్మిది వేణుమాధవ్‌కు వచ్చేవి
600 సినిమాల్లో..
ఈ విషయంపై చంద్రబాబుగారికి ఫిర్యాదు చేశారు. ఆయన వేణును తీసుకెళ్లి అసెంబ్లీలోని టీడీఎల్పీ లైబ్రరీలో కూర్చోబెట్టారు. పేపర్‌లో ప్రచురితం అయ్యే వార్తలను ఒక ఫైల్ చేయాలి. అలా ఉద్యోగం చేస్తూ, అసెంబ్లీ పక్కనే ఉన్న రవీంద్ర భారతిలో ప్రోగ్రాంలకు వెళ్లేవాడు వేణు. అక్కడ కూడా ప్రదర్శనలు ఇచ్చేవాడు. రచయిత దివాకర్ బాబుగారికి సన్మాన కార్యక్రమంలో మిమిక్రీ చేస్తుండగా, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చూసి, ‘సంప్రదాయం’లో వేణుకు అవకాశం ఇచ్చారు. దీంతో ఆక్కడ నుంచి వేణు వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు 600 సినిమాల్లో నటించాడు. ‘హంగామా’ చిత్రంతో హీరోగా కూడా మెప్పించాడు. దశాబ్ధిన్నర కాలంపాటు తిరుగులేని కమెడియన్‌గా సినీ పరిశ్రమలో రాణించాడు. ‘లక్ష్మి’ సినిమాకు గాను వేణుమాధవ్‌కు ఉత్తమ కమెడియన్‌గా నంది అవార్డును అందుకున్నారు.
పాత్రలను సృష్టించుకొని..
సినిమా ఇండస్ట్రీలో ఓ మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వాళ్లలో వేణు మాధవ్ కూడా ఒకరు. ఇతగాడు తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసి మెప్పించాడు. స్టార్ హీరోలతో వరసగా సినిమాలు చేసిన కమెడియన్ వేణుమాధవ్. ఒకానొక సమయంలో వేణు మాధవ్ లేకుండా సినిమాలు రాలేదని చెప్పాలి. వేణు చేసిన సినిమాలు వరసగా హిట్ అయ్యేవి. అలానే వేణుమాధవ్ కామెడీ కూడా ఆకట్టుకునేది. ఇక సినిమా ఇండస్ట్రీలో వేణు మాధవ్ తనకోసం ప్రత్యేకంగా పాత్రలను సృష్టించుకోవడం.. ప్రత్యేకంగా రైటర్స్‌ను పెట్టుకొని సినిమాలు చేయడం చేసేవారు. ఇలా చేయడం వలన ఆయనకు ఎంతో పేరు వచ్చింది. కొంతమంది రైటర్స్ కు ఉపాధి కూడా లభించింది. తాను నటించిన ప్రతి హీరోతోనూ ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉండేవాడు వేణు మాధవ్. ముఖ్యంగా మెగాస్టార్ తో అన్నయ్య ఉన్న అనుబంధం గురించి మర్చిపోలేదని. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో వేణు పాత్ర ఎంతబాగా వచ్చిందో చెప్పక్కర్లేదు. ఇక ఇదిలా ఉంటె, వేణు మాధవ్ ప్రభాస్ తో కలిసి చాలా సినిమాల్లో నటించారు. మెప్పించారు. వర్షం, అడవి రాముడు, ఛత్రపతి, చక్రం, యోగి, మున్నా, ఏక్ నిరంజన్ సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో తనదైన కామెడీతో మెప్పించాడు. ఒక విధంగా చెప్పాలి అంటే డార్లింగ్ ప్రభాస్ తోనే ఎక్కువ సినిమాలు చేశాడు ఈ కమెడియన్. ఛత్రపతి సినిమాలో వేణు మాధవ్ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. దాన్ని డిజైన్ చేసిన తీరు అద్భుతం అని చెప్పాలి. శ్రీయను ప్రేమించే వ్యక్తిగా రకరకాల గెటప్స్ లో కనిపిస్తాడు. ప్రభాస్ ఛత్రపతిగా మారిన తరువాత వేణు మాధవ్ కు పెళ్లి చేసే సీన్, వేణు మాధవ్ చండ్రకోలు తో కొట్టుకునే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. వేణుమాధవ్ టైమింగ్ కామెడీతో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం ఛత్రపతి టీ షరట్స్ ధరించి సరదగా క్రికెట్ ఆడుతూ అందరిని ఆకట్టుకున్నారు డార్లింగ్ ప్రభాస్, వేణు మాధవ్ లు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
రాలిన నవ్వుల కుసుమం
RELATED ARTICLES