న్యూ ఢిల్లీ: ఇటీవలె భారత్‌కు బంగారు పతకాల పంటపండించిన పరుగుల తార హిమదాస్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో చోటు సంపాదించింది. ఆమెతో పాటు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే 25 మంది క్రీడాకారుల జాబితాను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రకటించింది. నెల వ్యవధిలోనే ఐదు అంతర్జాతీయ స్వర్ణాలు సాధించి హిమదాస్ అందరి ప్రశంసలు అందుకుంది. ఆమె ప్రపంచ ఛాంపియన్ షిప్ మహిళల 4×400, మిక్స్డ్ 4×400 మీటర్ల రిలే పోటీల్లో పాల్గొననుంది. మిక్సడ్ 4×400 రిలే పోటీల్లో భారత్ పతకం సాధిస్తుందని ఐఎఏఫ్ ధీమా వ్యక్తం చేస్తుంది. 400 మీటర్ల రేసు విభాగంలో హిమదాస్ అర్హత సాధించని విషయం తెలిసిందే. మోచేయి శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్న జావెలిన్‌త్రో ఆటగాడు నీరజ్ చోప్రా ఎంపికపై తర్వలో సెలక్టర్లు చర్చిస్తారని ఏఎఫ్ఐ తెలిపింది. ’జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా ఎంపికపై సెలక్టర్లు త్వరలో చర్చిస్తారు. టోక్యో ఒలింపిక్స్‌లో అతడు రాణిస్తాడని భావిస్తున్నాం. స్పింటర్స్ ద్యుతీ చంద్ (100 మీ), అర్చన సుసీంద్రన్ (200 మీ), హైజంపర్ తేజస్విన్ శంకర్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ నెల 21న 400 మీటర్ల విభాగంలో అంజలీ దేవీకి అర్హత పోటీలు నిర్వహిస్తాం’ అని ఏఎఫ్ఐ తెలిపింది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు దోహాలో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరగనుంది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హిమదాస్
RELATED ARTICLES