నాదల్, స్విటోలినా ముందుకు
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి టాప్ సీడ్‌లు నొవాక్ జకోవిచ్ (సెర్బియా), నవోమి ఒసాకా (జపాన్)లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. మరోవైపు రెండో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్), 15వ సీడ్ అండ్రెస్కొ బియాంకా ప్రిక్వార్టర్ ఫైనల్ పోటీల్లో విజయం సాధించారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్ గాయంతో అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అప్పటికే అతని ప్రత్యర్థి, స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకా 6 7 2 ఆధిక్యంలో ఉన్నాడు. రెండు సెట్లు కోల్పయిన జకోవిచ్ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో వావ్రింకా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. మరో పోటీలో ఆరో సీడ్ జ్వరెవ్ కంగుతిన్నాడు. అర్జెంటీనా ఆటగాడు డీగో స్క్రావట్జ్‌మాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జ్వరెవ్ ఓటమి పాలయ్యాడు. అసాధారణ ఆటను కనబరిచిన డీగో 3 6 6 6 జ్వరెవ్‌ను చిత్తు చేశాడు. మరో పోటీలో రెండో సీడ్ నాదల్ 6 3 6 6 క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిక్‌ను ఓడించాడు. రెండో సెట్‌లో నాదల్‌కు చుక్కెదురైనా తర్వాతి రెండు సెట్లలో గెలిచి ముందంజ వేశాడు. మరో పోటీలో మెద్వెదెవ్ 3 6 6 7 జర్మనీకి చెందిన డొమ్నిక్ కొఫర్‌ను ఓడించాడు. తొలి సెట్‌ను కోల్పోయిన రష్యా స్టార్ తర్వాత వరుసగా మూడింటిలో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫ్రాన్స్ ఆశాకిరణం, 13వ సీడ్ మోన్‌ఫీల్స్ కూడా అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు.
బెలిండా సంచలనం
మరోవైపు మహిళల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ క్రీడాకారిణి బెలిండా బెన్సిక్ టాప్ సీడ్ ఒసాకాపై సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బెలిండా 7 6 ఒసాకాను ఓడించింది. తొలి సెట్‌లో టైబ్రేకర్‌లో గెలిచిన బెలిండా రెండో సెట్‌లో పెద్దగా ప్రతిఘటన లేకుండానే విజయాన్ని అందుకుంది. మరోవైపు ఐదో సీడ్ స్విటోలినా 7 6 అమెరికా స్టార్, పదో సీడ్ మాడిసన్ కీస్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రెండు సెట్లలో కూడా ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా స్విటోలినా విజయాన్ని సొంతం చేసుకుంది. మరో పోటీలో డొనా వెకిక్ విజయం సాధించింది. జర్మనీ స్టార్ జూలియాతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో వెకిక్ 6 7 6 జయభేరి మోగించింది. మరో మ్యాచ్‌లో బియాంకా 6 4 6 అమెరికాకు చెందిన టౌన్‌సిండ్‌ను చిత్తు చేసింది.
ఒసాక ఔట్
RELATED ARTICLES