గుజరాత్‌లోకి సముద్ర మార్గాన టెర్రరిస్టులు?
కాండ్ల, ముంద్రా రేవుల్లో హై అలర్ట్
భుజ్: గుజరాత్ తీరం నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు, పాక్ కమాండోలు ప్రయత్నిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో బిఎస్ఎఫ్, భారత కోస్ట్‌గార్డ్ దళాలు అప్రమత్తమయ్యాయి. చిన్నపాటి పడవల ద్వారా పాక్ నేవీతో శిక్షణ పొందిన ఉగ్రవాదులు, కమాండోలు గుజరాత్‌లోని కచ్, సర్ క్రీక్ ప్రాంతాలకు చేరుకోవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ ఉగ్రవాదులు రేవులు, ఓడలపై సముద్ర జలాల్లోనుంచే భీకర దాడులు జరపడంలో శిక్షణ పొందినట్టు నిఘా వర్గాలు సమాచారం చేరవేశాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ కచ్ జిల్లాలోని కాండ్ల, ముంద్ర పోర్టుల్లో, ఇతర కీలక వ్యవస్థాపనల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు గురువారం పోలీసులు తెలిపారు. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు చొరబడి దాడులు చేసే అవకాశముందని భారత నావికా దళం హెచ్చరించిన కొన్ని రోజుల తరువాత నిఘా వర్గాలు కూడా అలాంటి హెచ్చరికలే చేయడం గమనార్హం. కాగా, ఆదానీ గ్రూపు నడుపుతున్న ముంద్ర పోర్టు దేశంలోని అత్యధిక పోర్టుల్లో ఒక్కటి. అదే విధంగా కాండ్ల పోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ రెండు పోర్టులు కూడా పాకిస్థాన్‌కు అంత్యత సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉన్నాయి. జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నడుపుతున్న ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిలి రిఫనరీ, వదినగర్లో రష్యన్ గెయింట్ రోస్నెఫ్ట్ నిర్వహిస్తున్న ఇలాంటి సౌకర్యాలే కలిగి ఉన్న సంస్థాపన సహా అనేక కీలక సంస్థాపనలు కూడా ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఉగ్రవాదులు చొరబడే అవకాశముందని తమకు సమాచారం అందిందని, దీంతో కండ్ల పోర్టు సహా కచ్ జిల్లాలోని అన్ని ముఖ్యమైన సంస్థాపనల వద్ద భద్రతను పటిష్టం చేసినట్లు ఐజి (బార్డ్ర్ రేంజ్) డిబి వఘేలా తెలిపారు. నిజానికి ఆగస్టు 15వ తేదీ కంటే ముందు భద్రను కట్టుదిట్టం చేశామన్నారు. అయితే ఉగ్రవాదులు గుజరాత్‌లోకి చొరబడ్డారన్న పక్కా సమాచారం లేదని, అయితే ముష్కరులు సముద్రం ద్వారా చొరబడవచ్చనే సాధారణ సమాచారం అందిందన్నారు. కీలక సంస్థాపనల్లో ఒక్కటైన కచ్ జిల్లాలోని ముంద్ర పోర్టు వద్ద కూడా భద్రతను పెంచామని మరో పోలీసు అధికారి వెల్లడించారు. నిఘా వర్గాల హెచ్చరికల చేపథ్యంలో గుజరాత్ డిజిపి సూచనల మేరకు కచ్‌లోని అన్ని కీలక సంస్థాపనల వద్ద భద్రను పెంచినట్లు అంజార్ డిఎస్పి ధనంజయ్ వఘేలా విలేకరులకు తెలిపారు. పోలీసులు, ఇతర భద్రతా సంస్థలను తమ గస్తీని పెంచాయని, రంగంలోకి సముద్ర పోలీస్ దళం కూడా దిగిందన్నారు. అయితే గత వారం క్రితం సముద్ర మార్గాల ద్వారా హూక్షగవాదులు చొరబడి దాడులు చేయవచ్చని నావికా దళం కూడా హెచ్చరించింది. దీంతో సముత్ర తీరం వెంట హై అలర్ట్‌ను ప్రకటించింది. నావికాదళ డిప్యూటీ చీఫ్ మురళీధర్ పవార్ మాట్లాడుతూ తీర ప్రాంతాల వద్ద భద్రతా చర్యలను పెంచామని, దళాలు పెద్ద ఎత్తుని నిఘా పెట్టాయన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గరి నుంచి మన దేశానికి ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తోందని నిఘా సంస్థలు వెల్లడించాయి.
భారత్‌కు ఉగ్ర ముప్పు
RELATED ARTICLES