జీరో పెట్టుబడి రాబడి
జాతీయ క్రీడా దినోత్సవంలో ప్రధాని
న్యూఢిల్లీ: ఆరోగ్య భారత్ కోసం ‘ఫిట్ ఇండియా ఉద్యమం’ను గురువారం ప్రధాని మోడీ ఆరంభించారు. ఆరోగ్యంపై అవగాహనే లక్ష్యంగా ప్రభు త్వం ఈ ఉద్యమం చేపట్టింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ‘ అందరికీ శుభాకాంక్షలు. ఇదే రోజు ఓ గొప్ప క్రీడాకారుడైన మేజర్ ధ్యాన్‌చంద్ మన దేశంలో పుట్టారు. ఆయన తన ఫిట్నెస్తో, స్టామినాతో, హాకీ స్టిక్‌తో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. ఆయనకు ధన్యవాదాలు. ఫిట్నెస్ ఆరోగ్యానికి ఎంతో అవసరం. అది ప్రతి ఒక్కరి జీవనవిధానం కావాలి. జీవితంలో వ్యాయామం, క్రీడలు ఒక భాగం కావాలి. క్రీడల్లో రాణించాలంటే శారీరక దృఢత్వం చాలా ముఖ్యం. అలా ఉంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవు. దీన్ని నేటి యువతరం గుర్తించాలి. వ్యాయామం చేయాలని చెప్పడమే కాదు.. చేసి చూపించాలి. జీరో పెట్టుబడితో నూరు శాతం రాబడిలా ఫిట్‌నెస్‌లో లాభిస్తుంది’ అని చెప్పారు. శారీరకంగా దృఢంగా ఉంటే వ్యాధులు కూడా దరిచేరవన్నారు. అంగరంగ వైభవంగా ఆరంభించిన ఈ ‘ఫిట్ ఇండియా ఉద్యమం’ కార్యక్రమంలో దేశీయ యుద్ధ కళలు, నృత్యాలు, క్రీడలు కూడా చేర్చారు. ‘టెక్నాలజీతో కూర్చున్న చోట నుంచి కదలని జీవన విధానం తయారయింది’ అని మోడీ ఈ సందర్భంగా చెప్పారు. ‘శారీరక దృఢత్వం మన సంస్కృతిలో భాగం. కానీ నేడు శారీరక దృఢత్వం అంశంలో నిర్లక్ష్యం చూపిస్తున్నాం. కొన్ని దశాబ్దాల క్రితం సాధారణ వ్యక్తి రోజుకు 8 నుంచి 10 కిమీ. నడిచేవాడు. సైకిల్ నడిపేవాడు, పరుగెత్తేవాడు. కానీ నేడు టెక్నాలజీ కారణంగా శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మనం చాలా తక్కువ నడుస్తున్నాం. మనం నడవాల్సినంతగా నడవడం లేదని అదే టెక్నాలజీ మనకు చెబుతోంది’ అన్నారు. ‘నేటి తరం యువత ఈ నిశ్చల జీవనవిధానంతో అనేక అనారోగ్యాల బారిన పడుతోంది. మధుమేహం, హైపర్టెన్ష న్, తదితర జబ్బుల బారిన నేటి యువత పడుతోంది. 12 లేక 15 ఏళ్ల బాలలు సైతం మధుమేహం, గుండెపోటు వంటి జబ్బుల బారిన పడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. అయితే సకారాత్మక వ్యక్తుల నుంచి నేను మంచి ఫలితాలను ఆశిస్తున్నాను.ఈ జబ్బులన్నీ అస్తవ్యస్థ జీవన విధానం వల్ల వస్తున్న వి. వీటిన సరిచేయొచ్చన్న విశ్వాసం నాకుంది’ అని మోడీ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఫిట్నెస్ గురించి మాట్లాడ్డం అనేది ఫ్యాషనయిపోయిందే తప్ప ఆచరణలో వాటిని పెట్టడంలేదని కూడా ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ క్రీడా అవార్డులు అందుకున్న వారిని ప్రశంసించారు. ‘అస్తవ్య స్త జీవన విధానం వల్ల లేనిపోని జబ్బులు రావడం అన్న సమస్య మన దేశానికే కాదు, చైనా, ఆస్ట్రేలియా,జర్మనీ వంటి దేశాలలో కూడా ఉంది’అని మోడీ చెప్పా రు. ‘విజయానికి, శారీరక దృఢత్వానికి అవినాభావ సంబంధం ఉంది. విజ యం సాధించిన వ్యక్తులందరూ ఫిట్‌గానే ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉం టే, మానసికంగా కూడా దృఢంగా ఉంటాం(బాడీ ఫిట్ హైతో, మైండ్ ఫిట్ హై)’ అన్నారు.ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయమం, క్రీడలు జీవిత విధానం చేసే లక్ష్య ంతోనే ప్రధాని ఈ ‘ఫిట్ ఇండియా ఉద్యమం’ను ఆరంభించారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు సారథ్యంలో ఇండియన్ ఒలింపిక్ సంఘం సభ్యులు, జాతీయ క్రీడల సమాఖ్యలు, ప్రైవేట్ సంస్థలు, ఫిట్నెస్ ప్రమోటర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 28 మంది సభ్యులున్న ఈ కమిటీలో క్రీడలు, సెకండరీ ఎడ్యుకేషన్, ఆయుష్, యువజన వ్యవహార శాఖల సెక్రటరీలు కూడా ఉన్నారు.
ఆరోగ్య భారత్ కోసం ఫిట్ ఇండియా ఉద్యమం
RELATED ARTICLES