వచ్చే ఏడాది వరకు కొత్త పిసిసి అధ్యక్షుడు లేనట్టే
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఇప్పట్లో కొత్త వారు వచ్చే అవకాశం కనపడడం లేదు. వచ్చే ఏడాది వరకు ప్రస్తుత అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డే కొనసాగే అవకాశం ఉన్నది. అటు కేంద్ర నాయకత్వం విషయంలో స్పష్టత రాకపోవడంతో పాటు, సంస్థాగత ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో అధ్యక్ష పదవికి కనీసం ఆరు మాసాల వరకు మార్పు ఉండే అవకాశం లేనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌గాంధీ చేసిన రాజీనామాను ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఆమోదించింది. అదే సమావేశంలో మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆమె ఆ స్థానంలో కొనసాగే అవకాశముంది. అయితే, కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశమున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జమ్మూకశ్మీర్ పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడడంతో పాటు, దేశంలో చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా ఈ ప్రక్రియ ఉండనుందని తెలుస్తోంది. పైగా త్వరలో జరగనున్న మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై అధిష్టానం ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఖాళీగా ఉన్న జార్ఖండ్ వంటి రాష్ట్రాల పిసిసి అధ్యక్ష, ఇతర నాయకత్వ స్థానాలను భర్తీ చేయడం తక్షణ కర్తవ్యంగా ఉన్నది. వాస్తవానికి ఎఐసిసి అధ్యక్షుని రాజీనామాతో ఇతర కమిటీలు, పిసిసి కమిటీలు రద్దయినట్లుగానే భావించాల్సి ఉం టుంది. అయితే ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రాల్లో ప్రస్తుతం పిసిసి అధ్యక్షులుగా ఉన్న వారినే కొనసాగించే అవకాశముంది. ఆ తరువాత కాంగ్రెస్ అధ్యక్ష స్థానం కోసం కింది నుండి మళ్లీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పిసిసి, ఎఐసిసి సభ్యులు ఎన్నిక కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రక్రియకు కనీసం మూడు నుండి ఆరు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌కు ఉత్తమే అధ్యక్షునిగా కొనసాగనున్నారు. పైగా సోనియాగాంధీ అధ్యక్షురాలిగా ఉన్న