చంద్రయాన్ – 2 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: అంతరిక్ష చరిత్రలో భారత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చంద్రుడికి మీదికి రెం డో ప్రయోగం..చంద్రయాన్ ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. అత్యంత శక్తిమంతమైన రాకెట్ జిఎస్ఎల్వి ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. మూడు దశల రాకెట్ ప్రయోగం జులై 15న చేపట్టినప్పటికీ సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో దానిని చివరి 56 నిమిషాల్లో ఆపేసి ప్రయోగాన్ని సోమవారానికి రీషెడ్యూల్ చేశారు. చెన్నయ్‌కి 100 కిమీ. దూరంలో ఉన్న సతీశ్‌ధావన్ రోదసి కేంద్రం నుంచి 20గంటల కౌంట్ డౌన్ అనంతరం 3, 850 కిలోల బరువైన చంద్రయాన్ ఉపగ్రహంతో మధ్యాహ్నం 2.43 నిమిషాలకు నింగికెగసిన జిఎస్ఎల్వి -ఎంకె వాహకనౌక(రాకెట్) 16 నిమిషాల 13 సెకెండ్ల పాటు ప్రయాణించింది. అనంతరం భూమి కి దగ్గరగా 170కి.మీలు.. భూమికి దూరం 39,059 కి.మీల ఎత్తులో ఉన్న భూకక్ష్యలో చంద్రయాన్ విడిచిపెట్టింది. 5 రోజుల తర్వాత భూ నియంత్రత కక్ష్యలోకి చంద్రయాన్ ప్రవేశిస్తుంది. సగటును 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్ 7న చంద్రుడిపై దిగనుంది. రూ. 978 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ చంద్రుడిపై రోవర్‌ను దించే నాలుగో దేశంగా గుర్తింపు పొందనుంది. దీనికి ముందు రష్యా, అమెరికా, చైనా చంద్రుడి మీదికి ప్రయోగాలు విజయవంతం చేశాయి. ఇస్రో చీఫ్ కె శివన్ నేతృత్వంలో శాస్త్రజ్ఞులు ప్రయోగం ప్రతి దశను శ్రద్ధగా గమనిస్తూ పోయారు. ప్రతి కీలక దశలో విజయం సాధిస్తూ పురోగమిస్తున్న కొద్దీ వారు హర్షాన్ని ఆపుకోలేకపోయారు. చివరికి ‘మిషన్ విజయవంతం అయింది. చంద్రుడిపైకి భారత్ చారిత్ర పయనాన్ని ఆరంభించింది’ అని పేర్కొన్నారు. ప్రయోగంలో మరో నెలన్నర రోజుల్లో 15 కీలక యుక్తులు(మాన్యూవర్స్) ఉండనున్నాయని కూడా ఆయన చెప్పారు. చంద్రయాన్ ప్రయోగం… చంద్రయాన్ విజయవంతంగా ప్రయోగించిన 11 సంవత్సరాలకు చేపట్టారు. ఈ తాజా ఉపగ్రహ ప్రయో గం 2009 ఆగస్టు 29 వరకు 312 రోజులు పనిచేసి చంద్రుడి చుట్టూ 3400 పరిభ్రమణలు చేయనుంది. బాహుబలి రాకెట్ ప్రయాణం 16.31 నిమిషాలే ఉంటుం ది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత చం ద్రయాన్- మాడ్యూల్‌ను రోదసిలో వదిలి పెడుతుంది. ఇలా భూమికి 170.06 కి.మీ. దగ్గరగా, 39.120 కి.మీ. దూరంగా ఉండే దీర్ఘ వృత్తాకారపు భూ కక్ష్యలోకి చంద్రయాన్ మాడ్యూల్ చేరుకున్న వెంటనే కర్ణాటక బైలాలులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం దానిని తన ఆధీనంలోకి తీసుకోనుంది.సెప్టెంబర్ 6 మధ్య విక్రమం ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై దిగనున్నాయి. చంద్రుడి దక్షిణ ధృవంలో ఇవి దిగనున్నాయి. చంద్రయాన్ మిషన్‌లో 13 పేలోడ్లను తీసుకెళ్లారు. వాటిలో మూడు యూరొప్వి, రెండు అమెరికావి, ఒకటి బల్గేరియాది. అమెరికా రోదసి సంస్థ ‘నాసా’ లేజర్ రిట్రోరిఫ్టెక్టర్ అర్రే(ఎల్ఆర్ఎ) కూడా పేలోడ్లలో ఉంది. ఇది చంద్రుడిలో ఉన్న భూతత్వ విషయాలను పరిశోధించనుం ది. చంద్రుడి దక్షిణ ధృ వం చాలా ఆసక్తికర ప్రదే శం, ఉత్తర ధృవం కన్నా దక్షిణ ధృవమే నీడలో ఉంటోం ది. అక్కడ నీరు ఉండొచ్చని భావిస్తున్నా రు. అంతేకాక దక్షిణ ధృ వం క్రేటర్లలో ఇదివరకటి సౌర కుటుంబానికి సంబంధించిన ‘కోల్డ్ ట్రాప్స్’, ‘శిలాజం’ ఉన్నాయని ఇస్రో చెబుతోంది.