ప్రజాపక్షం / హైదరాబాద్ : నూతన సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. సరి గ్గా ఉదయం 11.00 గంటలకు నూతన సెక్రటేరియట్‌కు, 12 గంటలకు అసెంబ్లీ భవన నిర్మాణానికి భూమి పూజచేసి పునాది రాయివేయనున్నారు. ఈ శంకు స్థాపనలను పురస్కరించుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన సచివాలయానికి డి బ్లాక్ వె నుక భాగంలో (పబ్లిసిటీ సెల్‌కు కుడి పక్కన) భూమి పూజ చేయనున్నారు. అసెంబ్లీ భవనా న్ని ప్రస్తుత ఎర్రమంజిల్ ఆర్ అండ్ బి ఇంజినీర్ ఇన్ చీఫ్ భవన సముదాయం ఎదుటనున్న స్థలంలో శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఈ స్థలం ఎపికి కేటాయించగా ఇటీవలే ఈ స్థలాలను తెలంగాణకు ఎపి అప్పగించింది. అసెంబ్లీ, సచివాలయ భవనాలకు శంకుస్థాపన చేసే ప్రాంతాలను ఐబి, పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సెక్రటేరియట్‌లో శంకుస్థాపన చేసే ప్రాంతంలో షామియానాలు, టెంట్లు వేశారు. కేవలం వంద నుండి రెండు వందల మంది మాత్రమే కుర్చునేలా ఇక్కడ స్థలం ఉండడంతో ముఖ్యమైన వారినే శంకుస్థాపన ప్రాంతానికి అనుమతించే అవకాశం ఉందంటున్నారు.
నేడు అసెంబ్లీ, సెక్రటేరియట్‌లకు సిఎం శంకుస్థాపన
RELATED ARTICLES