టాంటన్ : 41 పరుగుల తేడాతో ఆసీస్ జట్టు పాకిస్తాన్‌ను ఓడించింది. బుధవారం టాంటన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 111 బంతుల్లో 107 పరుగులు చేశాడు. అలాగే ఆరోన్ ఫించ్ 82 పరుగులతో చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు గాను 307 పరుగులు చేసి ఆలౌటైంది. పాకిస్థాన్ ఎదుట 308 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ బౌలర్లలో మహమ్మద్ అమీర్ ఐదు వికెట్లు తీయగా.. అఫ్రిది రెండు, హసన్ ఆలీ, వాహబ్ రియాజ్, మహ్మద్ హషీజ్ తలో వికెట్‌ను తమ ఖాతాలలో వేసుకున్నారు. ఇదిలా ఉండగా వార్నర్‌కి వన్డేల్లో ఇది 15వ సెంచరీ. వార్నర్ క్రీజులో ఉన్నంతసేపు స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఆ తర్వాత నెమ్మదించింది. తరువాతి ఆటగాళ్లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. పాకిస్థాన్ మహ్మద్ అమీర్ చివర్లో అద్భుతం సృష్టించాడు. తన బంతులతో ఆసీస్‌కు దడ పుట్టించాడు. వన్డేల్లో అమీర్‌కు ఇది తొలి ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఇలా..
ఆరోన్ ఫించ్ (కెప్టెన్) 82 పరుగుల వద్ద అమిర్ బౌలింగ్‌లో హఫీజ్‌కు చిక్కాడు. డేవిడ్ వార్నర్ 107 పరుగుల వద్ద అఫ్రిది బౌలింగ్‌లో ఇమామ్‌కు దొరికాడు. స్టీవెన్ స్మిత్ 10 పరుగులు చేశాక హఫీజ్ బౌలింగ్‌లో ఆసిఫ్ ఆలీకి చిక్కి వెనుదిరిగాడు. గ్లెన్ మాక్స్వెల్ 20 పరుగుల వద్ద అఫ్రిది బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. మార్ష్ 23 పరుగులు చేశాక అమిర్ బౌలింగ్‌లో షోయిబ్ మాలిక్‌కు దొరికాడు. ఉస్మాన్ ఖ్వాజా 18 పరుగులు చేశాక అమిర్ బౌలింగ్‌లో రియాజ్‌కు దొరికి పెవిలియన్‌కు చేరాడు. అలెక్స్ కారీ (వికెట్ కీపర్) 20 పరుగుల వద్ద అమిర్ బౌలింగ్‌లో ఎల్బిడబ్ల్యు అయ్యాడు. నాధన్ కౌల్టర్ నైల్ 2 పరుగుల వద్ద రియాజ్ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌కు చిక్కాడు. పాట్ కుమ్మిన్స్ 2 పరుగుల వద్ద హసన్ ఆలీ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌కు దొరికి వెనుదిరిగాడు. మిచ్చెల్ స్టార్క్ 3 పరుగుల వద్ద అమిర్ బౌలింగ్‌లో షోయిబ్ మాలిక్‌కు దొరికాడు. రిచర్డ్సన్ 1 పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 49 ఓవర్లకు గాను 10 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.
పాకిస్తాన్ బౌలింగ్ ఇలా…
అమిర్ 10 ఓవర్లకు గాను 30 పరుగులు ఇచ్చాడు. 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అఫ్రిది 10 ఓవర్లు వేసి 70 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. హసన్ ఆలీ 10 ఓవర్లు వేసి 67 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. వాహబ్ రియాజ్ 8 ఓవర్లు వేసి 44 పరుగులిచ్చి 1 వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హఫీజ్ 7 ఓవర్లు వేసి 60 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. షోయిబ్ మాలిక్ 4 ఓవర్లు వేసి 26 పరుగులిచ్చాడు.
పాకిస్తాన్ బ్యాటింగ్ ఇలా..
ఇమామ్ 53 పరుగులు చేశాక కుమ్మిన్స్ బౌలింగ్‌లో అలెక్స్‌కు క్యాచ్ రూపంలో చిక్కాడు. జమాన్ ఖాతా తెరవకుండానే కుమ్మిన్స్ బౌలింగ్‌లో రిచర్డ్సన్కు క్యాచ్ ఇచ్చాడు. ఆజామ్ 30 పరుగుల వద్ద కౌల్టర్‌నైల్ బౌలింగ్‌లో రిచర్డ్సన్కు క్యాచ్ ఇచ్చాడు. మహమ్మద్ హఫీజ్ 46 పరుగులు చేశాక ఫించ్ బౌలింగ్‌లో స్టార్క్‌కు దొరికిపోయాడు. సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్) 40 పరుగుల వద్ద మాక్స్వెల్ బౌలింగ్‌లో రనౌటయ్యాడు. షోయబ్ మాలిక్ ఖాతా తెరవకుండానే కమ్మిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అసిఫ్ అలీ 5 పరుగులు చేశాక రిచర్డ్సన్ బౌలింగ్‌లో అలెక్స్‌కు దొరికాడు. హసన్ఆలీ 32 పరుగులు చేశాక రిచర్డ్సన్ బౌలింగ్‌లో ఖ్వాజాకు చిక్కాడు. రియాజ్ 45 పరుగులు చేశాక స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్‌కు దొరికాడు. అమిర్ ఖాతా తెరవకుండానే స్టార్క్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అఫ్రిది 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. 45.4 ఓవర్లకు 10 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.
41 పరుగుల తేడాతో ఆసీస్ విజయం
RELATED ARTICLES