ప్రజాపక్షం/ హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 బిసి రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని సిఎం కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో వీటిని ఈ నెల 17న సంబంధిత మంత్రులు, ఎంఎల్‌లు లాంఛనంగా ప్రారంభిస్తారు. కాగా రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 19 బిసి రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండేవి. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మరో 142 కొత్త బిసి రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కొత్తగా 119 బిసి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నది. రాష్ట ఏర్పాటుకు ముం దున్న 19 బిసి రెసిడెన్షియల్ స్కూళ్లకు అదనంగా తెలంగాణ ప్రభుత్వం 261 కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడంతో మొత్తం వీటి సంఖ్య 280కి చేరుకుంది. కాగా రాష్ట్రంలోని అన్ని కేటగిరీల కింద మొత్తం రెసిడెన్షియల్ పాఠశాలల్లో 91,680 మంది విద్యార్థులు విద్యసభ్యసిస్తుండగా, వీరికి 5,335 మంది ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు.
119 బిసి రెసిడెన్షియల్ సూళ్లు 17న ప్రారంభం
RELATED ARTICLES