మళ్లీ ప్రెంచ్ ఓపెన్ టైటిల్ రఫా వశం
ఫైనల్లో థీమ్‌పై గెలుపొందిన స్పెయిన్ బుల్
ఇది 18వ గ్రాండ్ స్లామ్
పారిస్: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో రఫా మరో రికార్డును తన పేరిట లిఖించకుకున్నాడు. వరుసగా 12వ సారి టైటిల్ నెగ్గి తన రిరార్డును తానే అధిగమించాడు. ఇక్కడ ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ మరోసారి ముద్దాడాడు. సెమీస్‌లో జకోవిచ్‌పై సంచలన విజయం నమోదు చేసి ఫైనల్లో అడుగుపెట్టిన థీమ్‌పై 6-3 5-7 6-1 6-1 నాదల్ విజయం సాధించాడు. దీంతో 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ సాధించిన టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. తాజా విజయంతో 18 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నాదల్ ఖాతాలో పడ్డాయి. టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన నాదల్కు థీమ్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. తొలి సెట్లో గట్టి పోటీనిచ్చినట్లు కనిపించిన థీమ్.. రెండో సెట్‌ను గెలుచుకుని నాదల్కు షాకిచ్చాడు. ఓ దశలో ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించిన థీమ్.. ఆ తర్వాత మ్యాచ్‌పై పట్టుకోల్పోయాడు. రెండో సెట్‌ను కోల్పోయిన నాదల్ కూడా ప్రత్యర్థికి ఏమాత్రం కోలుకోకుండాచేసి మూడు, నాలుగు సెట్లను గెలుచుకుని టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
నాదల్ పన్నెండోసారి..
RELATED ARTICLES