మూడు చోట్ల సిపిఐ(ఎం) విజయం
తిర్పూర్‌లో సుబ్బరాయన్, నాగపట్నంలో సెల్వరాజ్
తిరువనంతపురం : లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలకు నిరాశ మిగిలింది. లెఫ్ట్ పార్టీలకు ఐదు స్థానాలు దక్కాయి. సిపిఐ రెండు స్థానా ల్లో గెలవగా, సిపిఐ(ఎం) మూడు స్థానాల్లో విజయం సాధించింది. సిపిఐ తమిళనాడు రాష్ట్రంలోని తిర్పూర్, నాగపట్నం పార్లమెంటరీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. తిర్పూర్‌లో కె.సుబ్బరాయన్, నాగపట్నంలో ఎం.సెల్వరాజ్ విజయం సాధించారు. డిఎంకెతో పొత్తులో భాగంగా సిపిఐ ఈ రెండు స్థానాల్లో పోటీ చేసింది. కాగా, సిపిఐ(ఎం) తమిళనాడులోని కోయంబత్తూరు, మదురై స్థానాలతోపాటు కేరళలోని అలప్పుజ స్థానం లో విజయం సాధించింది.