రోహన్ సిద్ధార్థ, చైతన్యప్రియ హీరో హీరోయిన్లుగా జయం చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన ప్రణీత్ పండగ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్నాడు. ‘తుగ్లక్” పేరుతో ప్రణీత్ పండగ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గీతా టాకీస్ బ్యానర్లో, పరమ గీత సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు ఆద్యంతం ఆసక్తి కలిగించే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రం ఉండనుంది. ఈ చిత్రంలో ‘తుగ్లక్” టైటిల్ రోల్‌ను ప్రముఖ నటుడు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కులూ మనాలీలో అద్భుతమైన లొకేషన్స్‌లో తెరకెక్కించారు. హైదరాబాద్, రాజమండ్రిలో ఆఖరి షెడ్యూల్‌తో సినిమా పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరు గుతున్నాయి. జులై నెలలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా.. డైరెక్టర్ ప్రణీత్ పండగ మాట్లాడుతూ… మంచి లవ్ ఫీల్ కలిగిన స్టోరీతో ఉత్కంఠగా సాగే కథనంతో ‘తుగ్లక్” చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇటీవలే ఈ చిత్రంలోని పాటలను కులూ మనాలీలో అద్భుతమైన లొకేషన్స్ లో తెరకెక్కించాం. మా నిర్మాత పరమగీత గారు ఫుల్ సపోర్ట్ ఈ సినిమాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బ్రహ్మానందం గారు కీరోల్ ప్లే చేస్తున్నారు. చలపతిరావు, సత్యం రాజేశ్, సుమన్‌శెట్టి ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమాకు రాహుల్ కెమెరా వర్క్ ప్రధాన బలం. మహేశ్ ధీర అందించిన పాటలు చాలా బాగా వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా స్టోరీ, స్క్రీన్ ప్లే కుదిరింది. హైదరాబాద్, రాజమండ్రిలో జరిగే ఆఖరి షెడ్యూల్ తో సినిమా పూర్తి చేయనున్నాం. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై నెలలో ఈ చిత్రాన్ని గ్రా్‌ండ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని చెప్పారు.
జయం ఫేం ప్రణీత్ దర్శకత్వంలో ‘తుగ్లక్’
RELATED ARTICLES