న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ పర్యటనలో భా గంగా పాకిస్థాన్ లిసెస్టర్‌షైన్ జట్టుపై 58 పరుగులతో విజయం సాధించింది. బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన టి20 మ్యా చ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. పాక్‌కు ఓపెనర్లు మంచి ఆ రంభాన్ని ఇచ్చారు. బాబర్ ఆజమ్ (101; 63 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) టి20 కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ (52; 30 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) హా ఫ్ సెంచరీతో రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన లిసెస్టర్‌షైర్ 19.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. ఈ జట్టులో మైక్ (37) ఒక్కడే రాణించాడు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీం, షాహిన్ షా అ ఫ్రిది చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఆదివారం పాకిస్థాన్ మ ధ్య ఏకైక టి20 మ్యాచ్ జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది.
లిసెస్టర్‌షైర్‌పై పాక్ విజయం
RELATED ARTICLES