ఆసియా స్కాష్ ఛాంపియన్షిప్
కౌలాలంపూర్: భారత స్టార్ స్కాష్ ప్లేయర్లు జోష్న చిన్నప్ప, సౌరవ్ గోశాల్ ఆసియా ఛాంపియన్స్‌షిప్ సింగిల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. వీరితో పాటు తన్వి ఖన్న కూడా క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లింది. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్‌లో రెండో సీడ్ జోష్న చిన్నప్ప (3 11 11 11 తేడాతో కొరియాకు చెందిన లీ జియున్ను వరుస గేమ్‌లలో ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్ మరో మ్యాచ్‌లో తన్వి ఖన్న (భారత్) (3 9 5 18 11 11 తేడాతో ఏడో సీడ్ రాచెల్ మియా అన్నాల్డ్ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. తొలి రెండు గేమ్‌లను కోల్పోయిన భారత క్రీడాకారిణి తర్వాత అనూహ్యంగా పుంజుకొని ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది. వరుసగా పాయింట్లు సాధిస్తూ ముందుకు సాగింది. ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో గేమ్‌లో 18 గెలుపును అందుకున్న ఖన్న తర్వాత అదే జోరును ప్రదర్శిస్తూ వరుసుగా నాలుగో, ఐదో గేమ్‌లను నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సౌరవ్ గోశాల్ (భారత్) (3 11 11 11 జపాన్‌కు చెందిన రియునొసుకెను వరుస గేమ్‌లలో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు.
క్వార్టర్స్‌లో జోష్న, సౌరవ్
RELATED ARTICLES