ఫైనల్‌కు దూసుకెళ్లిన బార్సిలోనా
న్యూఢిల్లీ : ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మరో అరుధైన ఘనత సాధించాడు. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ తన ఫ్రాంచైజీ బార్సిలోనా తరఫున ఆడుతూ 600వ గోల్ సాధించి రికార్డు సృష్టించాడు. ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా బుధవారం బార్సిలోనా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాఛ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బార్సిలోనా 3 గోల్స్‌తో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తొలుత లూయిస్ స్వారెజ్ ఓ గోల్ సాధించడంతో బార్సిలోనా 1-0 ఆదిక్యంలో నిలిచింది. అనంతరం కెప్టెన్ మెస్సీ మరో రెండు గోల్స్ సాధించి తన జట్టును 3-0 ఆదిక్యంలోకి తీసుకెళ్లడంతో బార్సిలోనా ఘన విజయం సాధించింది. ఆట మరో 7 నిముషాల్లో ముగుస్తుందనగా మెస్సీ ఫ్రీ కిక్‌ను అద్భుతమైన గోల్‌గా మలిచిన తీరుతో అటు కామెంటేటర్లు ఇటు అభిమానులు ఫిదా అయ్యారు. మెస్సీ చేసిన ఈ గోల్ (బార్సిలోనా తరపున 600వది) చర్రిత్రాత్మకం అని కామెంటేటర్లు గ్యారీ లైన్కేర్, లియో గార్సియో పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ఎప్పుడూ లేనంతగా ఈ రోజు మేం సమష్టిగా రాణించాం. అందుకే ఈ గెలుపు సాధ్యమైంది. మొదటి గోల్ సాధించి స్వారెజ్ మా గెలుపునకు బాటలు వేశాడు. ఇక ఫైనల్లో కూడా ఇదే జోరును కనబర్చి టైటిల్ సాధిస్తామని మెస్సీ పేర్కొన్నాడు.
మెస్సీ 600వ గోల్..
RELATED ARTICLES