కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై మధ్యప్రదేశ్ సిఎం కమల్‌నాథ్
చింద్వారా (ఎంపి): ప్రస్తుత ఎన్నికల్లో హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుందని, ఢిల్లీలో కొత్త ప్రభు త్వం ఏర్పాటుకు ఎన్నికల అనంతర అలయెన్స్ ఏర్పడుతుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కాంగ్రెస్ పార్టీ “ చాలా చాలా మంచి ఫలితాలు” సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన, అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోదన్నారు. పాలక బిజెపికి తగినన్ని సీట్లురావు. మరే ప్రధాన రాజకీయ పార్టీ దానితో అలయెన్స్ పెట్టుకోదు. అందువల్ల అది మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా మంచి ఫలితాలు సాధించినా మెజారిటీకి చేరుకోదు. ఎన్నికల అనంతర అలయెన్స్ ఏర్పడుతుం ది. ఈ “అలయెన్స్ వివిధ రకాల కలయికలను ముందుకు తెస్తుందని పిటిఐ ఇంటర్వ్యూలో చెప్పారు. రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారా అని ప్రశ్నించగా” అలయెన్స్ ఏర్పడ్డాక అది నిర్ణయా లు తీసుకుంటుంది” అన్నారు. ఇవాళ రెండు రకాల అలయెన్స్‌లున్నాయి. ఒకటి బిజెపి వ్యతిరేక అలయెన్స్ రెండు బిజెపి అనుకూల అలయెన్స్. బిజెపి అనుకూల పార్టీల సంఖ్య బహు తక్కువ. యావత్ రాజకీయ దృశ్యం దానికి వ్యతిరేకంగా ఉండటాన్ని మీరు చూస్తున్నారు అని పేర్కొన్నారు. సంఖ్యలు ఎలా ఉన్నా తాము తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని బిజెపి భావిస్తున్నది. అది దూరహ్య ఆలోచన. వారికి సంఖ్య లు ఉండవు. వారితో కలిసే పార్టీ ఉండదు అని కమల్‌నాథ్ చెప్పారు. ఐదుకోట్ల కుటుంబాలను దారిద్య్రం నుంచి బయటకు తెచ్చే ‘న్యాయ్’ పథ కం విప్లవాత్మకం. కుటుంబానికి ఏటా రూ. 72వేలు అందజేసే కాంగ్రెస్ పథకానికి నిధుల కొరత ఉండదు. నిధులున్నాయి పునఃపంపిణీ చేయటమే ముఖ్యం అన్నారు. తన సన్నిహితులపై ఐటిదాడులు రాజకీయ దురుద్దేశంతో కూడినవన్నారు. మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కొరకు కేంద్ర ఏజన్సీలను దుర్వినియోగం చేస్తున్నదన్నారు. తన నాయకత్వం కింద దేశం సురక్షితంగా ఉందని ప్రధాని మోడీ చెప్పుకోవటం ‘సత్యదూర’మైన విషయమన్నారు. పార్లమెంటుపై దాడి, కార్గిల్ యుద్ధం సహా గరిష్ట సంఖ్యలో టెర్రర్ దాడులు బిజెపి అధికారంలో ఉన్నప్పుడే జరిగాయని కమల్‌నాథ్ గుర్తు చేశారు. ప్రజలను ఎంతగా దగా చేస్తారు అని మోడీని ప్రశ్నించారు. అనేక బూటకపు వాగ్దానాలతో మోడీ దేశ ప్రజలను దగా చేశారన్నారు.అచ్చీదిన్ ఎక్కడ? పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు ఎక్కడ? రెండు కోట్ల ఉద్యోగాలెక్కడ? స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా ఎక్కడ? ఈ వాగ్దానాలన్నీ ఏమైనాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని నాథ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్‌కు 22 వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 9 సార్లు ఎంపిగా ఎక్కువగా ఢిల్లీలోనే గడిపిన తాను మధ్యప్రదేశ్ అభివృద్ధికి వచ్చే ఐదేళ్లు కృషి చేస్తానని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చెప్పారు.