రాష్ట్రంలో పలు జిల్లాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు
కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం ఖమ్మంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదయింది. భద్రాచలం, నల్గొండ, రామగుండంలలో 41, హన్మకొండ, హైదరాబాద్, ఆదిలాబాద్‌లలో 39డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హకీంపేటలో 38, దుండిగల్‌లో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జగిత్యాల, నల్గొండ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచాయి. ఈ రకమైన వాతావరణం ఈ జిల్లాల్లో ఈ నెల21వ తేది వరకు ఉంటుంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలలో సోమవారం నమోదయిన గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి.