ఇప్పటివరకు రూ. 41.85 కోట్ల నగదు పట్టివేత
హైదరాబాద్‌లోనే రూ.4.9 కోట్లు
ప్రజాపక్షం / హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో నోట్ల కట్టలు ఫెళఫెళ మంటున్నాయి. ఇప్పటివరకు పట్టుబడ్డ నగదు అక్షరాల రూ. 41.85 కోట్లు. ఆదివారం ఒక్కరోజే రూ.80.47 లక్షల నగదు పట్టుబడడం గమనార్హం. ఇక మద్యం కూడా పెద్ద ఎత్తున పట్టుపడుతున్నది. ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న రూ.3.93 కోట్ల విలువైన 2.86 కోట్ల లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగ దు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలు ఇలా పట్టుబడ్డ వాటి మొత్తం విలువ రూ.49.10 కోట్లని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నిక ల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్దఎత్తున డబ్బు లు, మద్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అనుమానిత వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ఏ వాహనాన్ని వదలకుండా సొంత కార్లు, ఆటోలు, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలలో రాజకీయ పార్టీల నేతలు డబ్బులను రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సొంత వాహనాల పోలీసులు తనిఖీ చేసి పట్టుకుంటుండడంతో డబ్బు పంపిణీ చేసే రాజకీయ పార్టీల నేతల అనుచరులు తమ వ్యూహాన్ని మార్చి ఆర్‌టిసి బస్సులు, ప్రైవేటు ఆటోలలో ప్రయాణికుల మాదిరిగానే వెళ్తూ