ప్రజాపక్షం/ మంథని : ఆరుగాలం కష్టపడి పంట పండించిన ఓ రైతు తన పంట పొలాన్ని అగ్నికి ఆహుతి చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నంచాడు. మన దేశంలో రైతే రాజు అంటారు. కానీ, రైతులు పండించే పంటలకు నీళ్లు రాక పంటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయని పలువురు రైతులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే… పెద్దపల్లి జిల్లా మంథని మండలం నగరం పల్లె గ్రామానికి చెందిన తెగడ సంజీవ్ అనే రైతు ఎస్ఆర్ఎస్పి కెనాల్ నీళ్లపై ఆధారపడి తన పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు. అయితే ఈ కెనాల్లో నీళ్లు రాలేదు. నాలుగు ఎకరాల వరి పంట ఎండిపోయింది. తన పొలంలో ఉన్న బోరులో నీరు పాతాళానికి చేరుకుంది. దీంతో నిరుత్సాహానికి గురయ్యాడు. ఇప్పటివరకు పంట కోసం పెట్టుబడిగా ఒక లక్షా ఇరవై రూపాయలు ఖర్చు చేశాడు. నీరు రాక పంట ఎండిపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తన పంటను అగ్నికి ఆహుతి చేసి తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సమీపంలో ఉన్న రైతులు మంటలను చూసి హుటాహుటిన అక్కడకు చేరుకుని సంజీవ్‌ను కాపాడారు. ఆ తరువాత మంటలను అదుపు చేశారు.
పంటకు నిప్పుపెట్టి ఆత్మహత్యాయత్నం
RELATED ARTICLES