ఢాకా(బంగ్లాదేశ్): బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ‘బిజి147’ విమానాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేయడానికి ప్రయత్నించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఆ సంస్థ విమానం.. ఢాకా నుంచి చిట్టగాంగ్ మీదుగా దుబాయికి బయలుదేరాల్సి ఉంది. అయితే, ఢాకా నుంచి ఆ విమానం బయలుదేరిన కొద్దిసేపటికి, చిట్టగాంగ్‌లోని షా అమానత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది.బోయింగ్ 737 విమానంలోకి కమాండోలు ప్రవేశించి అనుమానిత హైజాకర్‌ను చంపేశారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం. చిట్టగాంగ్ జిఒసి మేజర్ జనరల్ ఎస్ఎం మతియుర్ రహ్మాన్ ఆదివారం రాత్రి 8.45కు విమానాశ్రయం వద్ద చేపట్టిన ఆపరేషన్ గురించి వివరించారు. 20 సంవత్సరాలకుపైన ఉన్న హైజాకర్‌ను ‘మహదీ’గా గుర్తించారు. అతడి వద్ద పిస్తోలు కూడా ఉండిందని విమాన సిబ్బంది తెలిపింది. ఆర్మీ కమాండోలకు సహకరించడానికి చిట్టగాంగ్‌లోని బంగ్లాదేశ్ వైమానిక స్థావరం నుంచి ఎయిర్ వైస్ మార్షల్ మహ్మద్ మఫిదుర్ రహ్మాన్ అనుమానితుడితో సంభాషణ జరిపారు. లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రుల్ హసన్ విమానాశ్రయంలో ఆపరేషన్ నిర్వహించారు. హైజాకర్ ప్రధాని షేఖ్ హసీనాతో మాట్లాడాలన్నాడని బంగ్లాదేశ్ వాయుసేన అధికారి తెలిపారు.
బంగ్లాదేశ్ విమానం హైజాక్
RELATED ARTICLES