సిఎంకు చాడ వెంకటరెడ్డి లేఖ
ప్రజాపక్షం/హైదరాబాద్: హైకోర్టు తీర్పు నేపథ్యంలో 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థుల నియామకాలు తక్షణమే చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, వివిధ జిల్లాల్లో సెలక్షన్ లిస్టుల్లో పేర్లు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని, 5 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ దృష్టికి తీసుకురావడం జరిగిందని, అప్పుడు మీరు కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే ఉద్యోగాలు ఇస్తామని వాగ్దా నం చేశారని చాడ వెంకటరెడ్డి ఆ లేఖలో గుర్తు చేశారు. ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచినా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. డిఎస్సి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా నల్లగొండ, ఖమ్మం కరీంనగర్, వరంగల్ జిల్లాల 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు నాలుగు వారాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని సెప్టెంబర్ 5న ఆదేశించిందని గుర్తుచేశారు. ఈ తీర్పును హై కోర్టు డివిజన్ బెంచ్కూడా సమర్థించిందన్నారు. ప్రత్యేక చొరవ తీసుకొని మానవతా ధృక్పథంతో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మీరిచ్చిన వాగ్దానం మేరకు డిఎస్సి క్వాలిఫైడ్ ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు.
98 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థుల నియామకాలు తక్షణమే చేపట్టండి
RELATED ARTICLES