రాష్ట్రంలో 91 వేల మార్క్‌ను దాటిన కరోనా బాధితులు
కొత్తగా 1102 మందికి సోకిన వైరస్
మరో 9 మంది మృతి, 693కు చేరిన మృతులు
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 90వేల మార్క్‌ను దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య తక్కువగా నమోదైంది. అలాగే కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గింది. కొత్తగా 1102 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం 91,361 కేసులు నమోదయ్యా యి. కరోనాతో 9 మంది చనిపోగా మృతుల సంఖ్య మొత్తం 693కు చేరింది. 12,120
మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందు లో 1046 రిపోర్టులు రావాల్సి ఉన్నది. 1930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,542 పాజిటివ్ కేసులు
ఉండగా ప్రస్తుతం 15,502 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ మేరకు శనివారం నాటి కరోనా హెల్త్ బులెటిన్‌ను వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసింది. కరోనా మరణాల రేటు రాష్ట్ర స్థాయిలో 0.75 ఉండగా జాతీయ స్థాయిలో 1.94 శాతంగా ఉన్నది. కరోనా నుంచి కోలుకుంటున్న వారు రాష్ట్రంలో 74.56 శాతం ఉండగా, జాతీయ స్థాయిలో 71.6 శాతంగా నమోదైంది. ఇతర వ్యాధులతో మరణిస్తున్న వారు 53.87 శాతం కాగా, కొవిడ్‌తో మృతి చెందుతున్న వారు 46.13 శాతం మంది ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 20,396 బెడ్స్ అందుబాటులో ఉండగా, 2616 బెడ్స్‌లలో కరోనా పేషంట్లు ఉన్నారు. మిగిలిన 17,780 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. జిహెచ్‌ఎంసితో పాటు మిగతా జిల్లాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నాయి. గడిచిన రెండు, మూడు రోజుల కేసులను పరిశీలిస్తే కొంత మేర తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో కరోనా పరీక్షలు 20 వేలకు పైగా నిర్వహించగా శనివారం నాడు 12,120 మందికే పరీక్షలను నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 7,44,555 పరీక్షలను నిర్వహించగా 68,126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. టెలి మెడిసిన్, వివిధ సమస్యల పరిష్కారానికి 104కు ఫోన్ చేయాలని, ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబరేటరీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి 9154170960 నంబర్‌కు ఫోన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
జిల్లాల వారీగా తాజా కరోనా పాజిటివ్ కేసులు
శనివారం నాడు ఆదిలాబాద్‌లో 14, భద్రాద్రి- కొత్తగూడెంలో 15, జిహెచ్‌ఎంసిలో 234, జగిత్యాలలో 11, జనగాంలో 16, జయశంకర్ భూపాల్‌పల్లిలో 0, జోగులాంబ గద్వాల్‌లో 17, కామారెడ్డిలో 33, కరీంనగర్‌లో 101, ఖమ్మంలో 46, కొమురంబీమ్ ఆసిఫాబాద్‌లో 3, మహబూబ్‌నగర్‌లో 37, మహబూబాబాద్‌లో 21, మంచిర్యాలలో 9, మెదక్‌లో 18, మేడ్చల్- మల్కాజిగిరిలో 63, ములుగులో 8, నాగర్‌కర్నూల్‌లో 29, నల్లగొండలో 28, నారాయణపేట్‌లో 4, నిర్మల్‌లో 4, నిజామాబాద్‌లో 33, పెద్దపల్లిలో 22, రాజన్న సిరిసిల్లాలో 13, రంగారెడ్డిలో 81, సంగారెడ్డిలో 66, సిద్దిపేటలో 30, సూర్యాపేటలో 13, వికారాబాద్‌లో 8, వనపర్తిలో 19, వరంగల్ రూరల్‌లో 25, వరంగల్ అర్బన్‌లో 70, యాదాద్రి-భువనగిరిలో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
91,361 కేసులు
RELATED ARTICLES