కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో నిర్వహిస్తాం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటన
ప్రజాపక్షం / హైదరాబాద్ ‘బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు’ డిమాండ్‌తో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి నిరసన దీక్షను ఈనెల 9వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. 2009- మధ్య కాలం లో సిపిఐ కొత్తగూడెం ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు శాసనసభలో బయ్యారం ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చర్చ లేవనెత్తారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బయ్యారం ప్రైవేటీకరణ చర్యను
వ్యతిరేకిస్తూ సిపిఐ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో వేలాది మందితో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేశారని, ఫలితంగా అప్పుడు ఇచ్చిన అనుమతులు రద్దు చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం కూడా ప్రధాన ఎజెండా కావడంతో విభజన హామీలలో చేర్చారని ఆయన వివరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా ఈ పరిశ్రమను ప్రభుత్వ రంగంలో చేపట్టడానికి సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటన చేశారని, ఈ నేపథ్యంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కలిసివచ్చే రాజకీయ పార్టీలతో కలిసి హైదరాబాద్‌లో జరిగే నిరసన దీక్షలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
9న ‘బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన’ నిరసన దీక్ష
RELATED ARTICLES