ప్రశాంతంగా ముగిసిన మూడో విడత
అత్యధికం యాదాద్రి జిల్లాలో 94.99శాతం
అత్యల్పం జగిత్యాల జిల్లాలో 77.70శాతం
గ్రామసీమల్లో ఉనికి చాటుకున్న ప్రతిపక్షాలు
ఆధిపత్యం నిలబెట్టుకున్న అధికారపార్టీ
హైదరాబాద్: ఆఖరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిసాయి. మూడో విడతలో 88.03శాతం పోలింగ్ నమోదయింది. తొలివిడతలో 4,479 పంచాయతీ ఎన్నికలకు నోటీస్ జారీ చేయగా తొమ్మిది పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాకపోవడం, 769 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 3,701 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో 4,135 పంచాయతీల ఎన్నికలకు నోటీస్ జారీ చేయగా 5 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 788 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,342 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. మూడోవిడతలో4,116 పంచాయతీల ఎన్నికలకు నోటీస్ జారీచేయగా 573 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
88.03% పోలింగ్
RELATED ARTICLES